Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ కేకుల్లా అమ్ముడు జియో సిమ్ కార్డులు.. ఒక్కో సిమ్ రూ.500 నుంచి రూ.1000 దాకా...

అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించి టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో సరికొత్త రికార్డును సృష్టించింది. నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుం

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (17:42 IST)
అతి తక్కువ ధరకే డేటా ఆఫర్స్‌ను ప్రకటించి టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో సరికొత్త రికార్డును సృష్టించింది. నిన్నమొన్నటి వరకూ కొన్ని పరిమిత స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకే లభించిన ఈ సేవలు సెప్టెంబర్ 5 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇత‌ర నెట్‌వ‌ర్కులు వాడే వినియోగ‌దారులు కూడా రిల‌య‌న్స్ జియోపైనే మొగ్గు చూపుతున్నారు. ఒక్కో సిమ్‌ రూ.500 నుంచి రూ.1000 దాకా చెబుతున్నా హాట్‌కేకుల్లా వినియోగదారులు ఏమాత్రం ఆలోచించకుండా కొనేస్తున్నారు. 
 
కారణం.. వెయ్యి రూపాయలు పోసి కొన్నా ఆ తర్వాత డిసెంబరు దాకా అన్‌లిమిటెడ్‌ డేటా, కాల్స్‌, ఎస్సెమ్మె‌స్‌ల ద్వారా లాభం పొందొచ్చనే ఉద్దేశంతోనే. అందునా.. జనవరి నుంచి జియో ప్యాకేజీలు ఎంత తక్కువగా అందుబాటులోకి రాబోతున్నాయో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించాక జియో సిమ్‌లకు డిమాండ్‌ మరింత పెరిగింది. జియో గురించి అంతగా వివరాలు తెలియనవారు వచ్చి వాటి గురించి ఆరా తీస్తే సిమ్‌ ఖరీదు రూ.500 అని చెబుతున్నారు. 
 
అమాయకుల దగ్గర్నుంచి ముక్కుపిండి రూ.500 వసూలు చేస్తున్నారు. కానీ, మొబైల్‌ విక్రయదారులు మాత్రం తమ దుకాణంలో అమ్మే ఎల్‌వైఎఫ్‌ ఫోన్లను ఎమ్మార్పీపై ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా అమ్ముతున్నారు. సెప్టెంబర్ 5 నుంచి రిలయన్స్ స్టోర్స్‌లో మాత్రమే సిమ్‌కార్డ్స్‌ను విక్రయిస్తారని సంస్థ తెలిపింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments