Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమిస్తావా లేదంటే చంపమంటావా...? ప్రేమోన్మాది... పోడా పొరికి నాయి( పోరా పోకిరి కుక్క)... యువతి

ఇదివరకటి రోజుల్లో నిన్ను ప్రేమిస్తున్నా... అని ఏ అమ్మాయితోనైనా అంటే... ఆ అమ్మాయి కుదర్దు అంటే గమ్మున నోరు మూసుకుని వెళ్లేవారు ప్రేమికులు. ఇప్పుడు కూడా అలాంటివారు ఉన్నప్పటికీ, కాదంటే సదరు అమ్మాయిని కాటికి పంపేందుకు స్కెచ్ లు వేసేవారు ఎక్కువవుతున్నారు.

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (17:17 IST)
ఇదివరకటి రోజుల్లో నిన్ను ప్రేమిస్తున్నా... అని ఏ అమ్మాయితోనైనా అంటే... ఆ అమ్మాయి కుదర్దు అంటే గమ్మున నోరు మూసుకుని వెళ్లేవారు ప్రేమికులు. ఇప్పుడు కూడా అలాంటివారు ఉన్నప్పటికీ, కాదంటే సదరు అమ్మాయిని కాటికి పంపేందుకు స్కెచ్ లు వేసేవారు ఎక్కువవుతున్నారు. ప్రేమిస్తావా లేదంటే చంపమంటావా అని డైరెక్టుగా బెదిరించడం ఎక్కువైంది కూడా. అలాంటివారిని అమ్మాయిలు లైట్ గా తీసుకోవడంతో పరిస్థితి చేయిదాటి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చి పెడుతోంది. 
 
తాజాగా తమిళనాడులోనిని విల్లుపురంలో ఓ నర్సుపైన ప్రేమోన్మాది దాడి చేసి వీరంగం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే... తమిళానాడు లోని కలూర్ జిల్లా విరుదాచలం ముదాట్టియార్ గ్రామానికి చెందిన చెల్లముత్తుకు 21 ఏళ్ల పుష్పలత అనే కుమార్తె ఉంది. ఆమె నర్సింగ్ కోర్సు చేసి సమీపంలోని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తోంది. రోజూ సైకిలు పైన వెళ్లి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ధనశేఖర్ ఆమెపై కన్ను వేసాడు. ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. ఒకరోజు సైకిలుకు అడ్డుగా వచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించింది. 
 
ఐతే అతడు ఆమెను వదల్లేదు. మరో రోజు వచ్చి నన్ను ప్రేమిస్తావా లేదంటే చంపమంటావా... అని బెదిరించాడు. అతడి బెదిరింపుకు ఆగ్రహం చెందిన సదరు యువతి.. పోడా పొరికి నాయి(పోరా పోకిరి కుక్క) అని అంది. దాంతో పట్టరాని కోపంతో తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసుకుని ఆమెపైకి దాడికి దిగాడు. ఈ హఠత్పరిణామానికి భీతిల్లిన యువతి కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి రాగానే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లిదండ్రులు కేసు నమోదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments