Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టోక్ పార్క్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:42 IST)
Reliance
బ్రిటన్‌లోని రెండోతరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీక్లబ్ 'స్టోక్ పార్క్'ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ గ్రూప్ (ఐజీ)కి చెందిన ప్రతిష్ఠాత్మక కంట్రీక్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ అయిన 'స్టోక్‌పార్క్'ను 57 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 592 కోట్లు) కు కొనుగోలు చేసింది. 
 
ఈ మేరకు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిమెంట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒప్పందంపై సంతకం చేసింది. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 3.3 బిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. 
 
రిటైల్ రంగంలో 14 శాతం, టెక్నాలజీ, మీడియా, టెలికం (టీఎంటీ) రంగంలో 80 శాతం, ఎనర్జీ రంగంలో ఆరు శాతం పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించింది. రిలయన్స్ సొంతమైన లగ్జరీ స్పా, హోటల్, గోల్ప్ కోర్స్, కంట్రీక్లబ్‌ బకింగ్‌హామ్‌షైర్‌లో 300 ఎకరాల్లో విస్తరించి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments