రిలయన్స్ బిగ్ టీవీ బంపర్ ఆఫర్.. ఒక యేడాది పాటు ఉచితం

పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ బిగ్ టీవీ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ టీవీ త్వరలోనే సెట్‌టాప్ బాక్స్‌లను విక్రయించనుంది.

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (15:48 IST)
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ బిగ్ టీవీ ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ టీవీ త్వరలోనే సెట్‌టాప్ బాక్స్‌లను విక్రయించనుంది. వీటిని నిర్ణీత కాలగడువులోపు బుక్ చేసుకునేవారికి ఒక యేడాది పాటు ఉచితంగా హెచ్‌డీ ఛానెళ్లను ఆఫర్ చేయడమే కాకుండా మరో 500ల ఫ్రీటూ ఎయిర్ ఛానెల్స్‌ను ఐదేళ్లపాటు ఉచితంగానే వీక్షించే వెసులుబాటు ఇచ్చింది. 
 
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, మార్చి 1 నుంచి తన కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి హెచ్‌డీ హెచ్‌ఈవీసీ సెట్-టాప్ బాక్స్‌ను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. షెడ్యూల్ రికార్డింగ్, యూట్యూబ్ సపోర్ట్, యూఎస్‌బీ పోర్ట్ లాంటి పలు ఫీచర్లు ఈ సెట్‌టాప్ బాక్స్‌లో ఉండనున్నాయి. 
 
అయితే, బుకింగ్ సమయంలో కనెక్షన్ కోసం రూ.499 చెల్లించాలి ఉంటుంది. ఆతర్వాత సెట్-టాప్ బాక్స్, అవుట్‌డోర్ యూనిట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారులు రూ.1500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక యేడాది ఉచిత సేవలు ముగిసిన తర్వాత తదుపరి రెండేళ్లపాటు ప్రతినెలా రూ.300లతో రీఛార్జి చేయాలని.. ఆ రెండేళ్లు పూర్తైయిన తర్వాత బుకింగ్, ఇన్‌స్టాల్ చేసే సమయంలో చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని రిలయన్స్ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments