బ్యాంకు రుణగ్రహీతలకు గుడ్ న్యూస్.. రూ.2కోట్ల వరకు మారటోరియం వడ్డీ మాఫీ

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (12:44 IST)
బ్యాంకు రుణగ్రహీతలకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం కాలంలో రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై వడ్డీ మాఫీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది కేంద్రం. ఈ మేరకు, సుప్రీంకోర్టులో శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.. మార్చి నుంచి ఆగస్టు వరకు నెలవారి చెల్లించాల్సిన రుణాలపై వడ్డీ మాఫీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.
 
చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలు, విద్యా రుణాలు, గృహరుణాలు, వాహన రుణాలు, క్రెడిట్‌ కార్డుల రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఫ్రొఫెషనల్ రుణాలపై వడ్డీ మాఫీ కానుంది.. ఈ మేరకు, మాజీ కంట్రోలర్ ఆండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఆమోదించింది.
 
అయితే, ఆరునెలలపాటు అన్ని బ్యాంకు రుణాలపై వడ్డీ మాఫీ చేస్తే, బ్యాంకులు కుప్పకూలిపోతాయని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.. అలా అన్ని రకాల బ్యాంకు రుణాలపై వడ్డీని మాఫీ చేస్తే సుమారు 6 లక్షల కోట్ల రూపాయల భారాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్ధిక శాఖ పేర్కొంది. 
 
ఈ పరిణామం చాలా బ్యాంకుల మూలధనం మొత్తం కరిగిపోవడమే కాకుండా, బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ, ప్రభుత్వం పేర్కొన్న ప్రకారం.. రుణగ్రహీత తాత్కాలిక నిషేధాన్ని పొందారా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా వడ్డీపై మాఫీ ఉంటుందని చెబుతోంది. అయితే, సోమవారం కూడా దీనిపై విచారణ జరుపబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అరి.. ప్రయాణంలో తండ్రిని, బావని కోల్పోయిన దర్శకుడు ఎమోషనల్ పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments