Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకిన గర్భిణీకి పురుడు పోసిన ఆంబులెన్స్ సిబ్బంది

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (11:33 IST)
కరోనా వైరస్ సోకిన ఓ గర్భిణీకి 108 ఆంబులెన్స్ సిబ్బంది పురుడు పోసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శుక్రవారం జరిగింది. పట్టణంలో న్యూ అర్బన్ కాలనీకి చెందిన అనూష.. నిండు గర్భిణీగా ఉన్నప్పుడు కరోనా వైరస్ సోకింది. 
 
శుక్రవారం అనూషకు నొప్పులు రాగా బంధువులు వైద్యులను సంప్రదిస్తే.. హైదరాబాద్ తరలించమన్నారు. ఈ మేరకు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని ఆమెకు వాహనంలో పురుడు పోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
అంబులెన్స్ టెక్నీషియన్ స్వాతి ఆమెకు ప్రాథమికంగా చికిత్స అందించి.. అనంతరం వేములవాడ ఆరోగ్య కేంద్రానికి తరలించగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. తొలిసారి అయినా.. కాన్పును సక్రమంగా నిర్వహించిన 108 టెక్నీషియన్ స్వాతి, పైలెట్ బాలకృష్ణను స్థానికులు అభినందించారు.

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments