Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు.. త్వరలోనే ఈ-పాస్ పోర్టుల కోసం సన్నాహాలు: వీకే సింగ్

పాస్ పోర్టులను జిల్లా హెడ్ పోస్టాఫీసుల్లో పొందేలా విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు అనుగుణంగా పాస్ పోర్టు సేవలను సరళీకృతం చేసే దిశగా తపాలాశాఖలో కూడా పాస్ పోర్టు సేవలను అందు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:50 IST)
పాస్ పోర్టులను జిల్లా హెడ్ పోస్టాఫీసుల్లో పొందేలా విదేశీ వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజలకు అనుగుణంగా పాస్ పోర్టు సేవలను సరళీకృతం చేసే దిశగా తపాలాశాఖలో కూడా పాస్ పోర్టు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖాధికారులు ఫిబ్రవరిలో ప్రకటన చేశారు. తద్వారా విదేశీ వ్యవహారాల శాఖ తపాలా శాఖతో కలిసి పనిచేయడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు.
 
ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ-పాస్ పోర్టులకు రంగం సిద్ధం అవుతుంది. ఇందులో భాగంగా ఈ-పాస్ పోర్టు సేవల కోసం తగిన సన్నాహాలను ప్రారంభించామని  విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, పాస్ పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు ఉండేందుకుగాను చిప్ ఆధారిత ఈ-పాస్ పోర్టులను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 
 
ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా టెండర్లు పిలిచే బాధ్యతను నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌‍కు అప్పగించినట్లు తెలిపారు. ఈ విధానం అమల్లోకి వస్తే దరఖాస్తుదారుల వ్యక్తిగత వివరాలు, డిజిట్ సంతకం ఆ చిప్‌లో ఉంటాయని వీకే సింగ్ తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments