Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పుతో కొట్టింది నిజమే.. అయితే ఏంటి? మర్డర్ కేసు పెట్టుకోండి : ఎయిరిండియా ఉద్యోగులతో ఎంపీ (Video)

ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన మాట నిజమేనని, అయితే ఏంటట? అంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగులపై శివసేన ఎంపీ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు... తనపై మర్డర్ కేసు పెట్టుకోండంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. శివసేన ఎ

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2017 (10:45 IST)
ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన మాట నిజమేనని, అయితే ఏంటట? అంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగులపై శివసేన ఎంపీ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు... తనపై మర్డర్ కేసు పెట్టుకోండంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. శివసేన ఎంపీ రవీంద్ర గ్వైకాడ్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన 80 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో బహిర్గతమైంది. ఇది మరింత దిగ్భాంతి కలిగిస్తోంది. ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ చెప్పుతో కొడుతున్నప్పుడు పక్కనే ఉన్న సిబ్బంది ఎంతగా వేడుకున్నా ఆయన వెనక్కి తగ్గక పోవడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. 
 
దీంతో ఆయనపై మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేయగా... ‘‘ఏంటి నామీద కేసు పెడతారా... ఇప్పటికే చాలా కేసులున్నాయ్... కావాలంటే మర్డర్ కేసు పెట్టుకోండి’’ అంటూ ఆయన మాట్లాడడంతో అక్కడున్నవారంతా విస్మయం వ్యక్తం చేశారు. 
 
అనంతరం ఆమె కలుగజేసుకుని... ‘‘మీరు మా ప్రతినిధి సర్... మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు.. మీకు మేము ఓటేసి ఎన్నుకున్నాం... మీరు మాత్రం ఎందుకిలా చేస్తున్నారు..’’ అంటూ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ గైక్వాడ్ వెనక్కి తగ్గలేదు సరికదా మిగతా వారిపైనా చిందులేయడం మొదలుపెట్టారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga chaitanya Sobhita dhulipala Wedding నాగచైతన్య-శోభిత పెళ్లి

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే... చిన్నారి డ్యాన్స్ అదిరింది.. (వీడియో)

క్రైం థ్రిల్లర్ గా వరుణ్ సందేశ్ చిత్రం కానిస్టేబుల్

మోక్షజ్ఞతో ఆదిత్య 369కి సీక్వెల్‌ గా ఆదిత్య 999 మ్యాక్స్

డ్రింకర్ సాయి బ్యాడ్ బాయ్స్ బ్రాండ్ తో విడుదలకు సిద్ధంగా ఉన్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hair fall control tips ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

తర్వాతి కథనం
Show comments