Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోట్లను వదిలించుకోవడానికి కంపెనీ యజమానుల కొత్త ఎత్తుగడ... ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (15:04 IST)
భారత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు సెప్టెంబరు నెలాఖరుతో దేశ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న రూ.2 వేల నోటు రద్దు కానుంది. తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటును ఈ గడువు లోగా బ్యాంకుల్లో మార్చుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీల యజమానులు తమ వద్ద మూలుగుతున్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నాయి. 
 
నిన్నామొన్నటి వరకు బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లపై దృష్టి పెట్టిన యజమానులు ఇపుడు తమ వద్ద పని చేసే ఉద్యోగులకు రూ.2 వేల నోట్లను వేతనాలుగా ఇస్తున్నాయి. పైగా, ఇప్పటివరకు ఐదు నుంచి పదో తేదీ వరకు చెల్లించే వేతనాలను ఇపుడు ఒకటో తేదీనే ఠంచనుగా ఇచ్చి, స్వామి కార్యం స్వకార్యం పూర్తయిందని చేతులు దులిపేసుకుంటున్నారు. 
 
సాధారణంగా ప్రతినెలా నాలుగు, ఐదో తేదీల్లో వేతనాలు ఇస్తుండగా మే నెల జీతం జూన్‌ ఒకటో తేదీనే ఇవ్వడంతో ముందే ఇస్తున్నారన్న సంతోషంతో వాటిని తీసుకున్నామని ఆ ఉద్యోగులు చెబుతున్నారు. మరికొందరు వేతనం రూ.10 వేలు ఉంటే రూ.20 వేలు చేతిలో పెట్టి మరో పదివేలు బ్యాంకులో మార్చుకొని రావాలని ఆదేశిస్తున్నారని తెలిపారు. ఇలా జూన్‌ ఒకటో తేదీన నగరంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments