Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాక్సివిజన్ ఐ హాస్పిటల్ హెచ్ఆర్, పేరోల్ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి గ్రేట్ హెచ్ఆర్‌తో ఒప్పందం

Advertiesment
image
, గురువారం, 11 మే 2023 (20:38 IST)
గ్రేట్ హెచ్ఆర్‌, ప్రముఖ హెచ్ఆర్ & పేరోల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్, ఇటీవల మాక్సివిజన్ ఐ హాస్పిటల్‌తో తమ కొత్త ఉత్పత్తి-ఆధారిత సర్వీసును ప్రకటించింది. హాస్పిటల్ దాని 890కు పైగా ఉద్యోగులకు హెచ్ఆర్, పేరోల్ ప్రక్రియలను ఆటోమేట్ చేయడానికి గాను గ్రేట్ హెచ్ఆర్‌ ప్లాట్‌ఫామ్‌ను అమలు చేస్తుంది.
 
గ్రేట్ హెచ్ఆర్‌ సాఫ్ట్‌వేర్‌, మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్‌లోని హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి జీవితం, పేరోల్ ప్రాసెసింగ్, జీతానికి సంబంధించిన అనుకూలీకరణ, చట్టబద్ధమైన సమ్మతులు, వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్, సెలవు, హాజరు ప్రాసెసింగ్, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ మరియు మరిన్నింటిని సులభతరం చేస్తుంది.
 
"మేము మాక్సివిజన్ ఐ హాస్పిటల్‌ను మా ప్లాట్‌ఫామ్‌లోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. ఈ భాగస్వామ్యం ఆసుపత్రి HR విధానాలను మెరుగుపరుస్తుందని, ఉత్పాదకతను మెరుగుపరచడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి మరియు మొత్తం ఉద్యోగుల సంతృప్తిని పెంపొందించగలదని భావిస్తున్నాము." అని గిరీష్ రౌజీ, సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ, గ్రేట్ హెచ్ఆర్‌ అన్నారు.
 
"మా HR కార్యకలాపాలను మెరుగుపరచడానికి గ్రేట్ హెచ్ఆర్‌ లోకి ప్రవేశించడానికి మేము సంతోషిస్తున్నాము. మేము విస్తరణ కొనసాగుతున్నప్పుడు మా డైనమిక్ HR అవసరాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఈ పరిష్కారం మాకు సహాయపడుతుందని మా సంస్థ విశ్వషిస్తుంది" అని మిస్టర్ సుధీర్, CEO, మాక్సివిజన్ గ్రూప్, అన్నారు.
 
గ్రేట్ హెచ్ఆర్‌ ప్రస్తుతం Greytip సాఫ్ట్‌వేర్ ద్వారా అభివృద్ధి చేయబడిన ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి 20,000లకు పైగా వ్యాపారాలతో 2 మిలియన్ల కంటే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉంది. ఇది HR ఆటోమేషన్‌కు, ముఖ్యంగా భారతదేశంలోని చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు ప్రాధాన్య ఎంపికగా మారింది. గ్రేట్ హెచ్ఆర్‌ 2023 HR డొమైన్‌లో G2 యొక్క ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ని పొంది, కంపెనీ ప్రశంసల జాబితాను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం జనసేనకు లేదు.. పవన్