ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం విశాఖపట్టణం పర్యటనకు వెళుతున్నారు. ఇందుకోసం ఆయన గన్నవరం నుంచి విమానంలో విశాఖ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టరులో పీఎం పాలెంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి వెళతారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ఆ తర్వాత హెల్త్ సిటీలోని అపోలో ఆస్పత్రిలో కేన్సర్ విభాగాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బీచ్ రోడ్డులో వీఎంఆర్డీఏ నిర్మించిన సీ హ్యారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచే ఎంవీపీ కాలనీలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను, రామనగర్‌లోని వాణిజ్య సముదాయాన్ని ప్రారంభిస్తారు.
ఆ తర్వాత ఎండాడలో నిర్మించనున్న కాపు భవన్‌కు శంకుస్థాపన చేస్తారు. పిమ్మట పక్కనే ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటరులో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడ నుంచి విమానాశ్రయానికి చేరుకొని తిరిగి విజయవాడలోని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు.