Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే లీటరు ధర రూ.27.45 పైసలే.. నిజమా?

భారత్‌లో పెట్రోల్ ప్రాథమిక ధర రూ.19 కాగా, బేస్ ధర 27.45కు విక్రయించవచ్చునట. ఈ విషయాన్ని నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బాలమోహన్‌దాస్‌ వెల్లడించారు. జీఎస్‌టీ విశాఖలో బుధవారం న

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (12:01 IST)
భారత్‌లో పెట్రోల్ ప్రాథమిక ధర రూ.19 కాగా, బేస్ ధర 27.45కు విక్రయించవచ్చునట. ఈ విషయాన్ని నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ బాలమోహన్‌దాస్‌ వెల్లడించారు. జీఎస్‌టీ విశాఖలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ పాల్గొన్నారు. ఇందులో బాలమోహన్ దాస్ పెట్రోల్ ధరలపై మాట్లాడారు. 
 
ఈ నెల 16వ తేదీ లెక్కల ప్రకారం క్రూడాయల్‌ బారెల్‌ ధర 45 డాలర్లు కాగా దిగుమతి సుంకం మరో రెండు డాలర్లు కలుపుకుంటే బ్యారెల్‌ 47 డాలర్లు పడుతోందన్నారు. రూపాయల్లో చూసుకుంటే రూ.3,050 అవుతుందని వివరించారు. ఒక బ్యారెల్‌కు 159 లీటర్ల పెట్రోల్‌ వస్తుందని, ఆ లెక్కన చూసుకుంటే లీటరు పెట్రోల్‌ రూ.19.18కు వస్తోందన్నారు. 
 
ఈ ధరకు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.5.65, రవాణా వ్యయం రూ.2.68 కలుపుకొంటే లీటర్‌ పెట్రోల్‌ బేస్‌ ధర రూ.27.45 పడుతోందని ఆయన వివరించారు. దీనిపై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.21.48, డీలర్‌ కమీషన్‌ రూ.2.57, వ్యాట్‌ రూ.13.92 కలుపుకొంటే మొత్తం లీటర్‌ రూ.65.42కు విక్రయిస్తున్నారన్నారు. ఇక్కడ ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ (రూ.21.48+13.92) రూ.35.40 అవుతోందని, ఇది బేస్‌ రేటు కంటే అధికమని బాలమోహన్‌దాస్ వివరించారు. అందువల్ల పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని ఆయన కోరారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments