Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రోడ్డులో వ్యభిచారిణుల ఇష్టారాజ్యం... రాత్రివేళ మహిళలకు భద్రత కరవు

దేశ రాజధాని న్యూఢిల్లీ అనేక నేరాలకు ఘోరాలకు అడ్డగా మారిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన రహదారుల్లో ఎంజీ రోడ్డు (మెహ్రౌలీ-గుర్గామ్) రోడ్డు వ్యభిచారిణులకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఈ రహదారి రాత్రిపూ

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (11:52 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ అనేక నేరాలకు ఘోరాలకు అడ్డగా మారిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన రహదారుల్లో ఎంజీ రోడ్డు (మెహ్రౌలీ-గుర్గామ్) రోడ్డు వ్యభిచారిణులకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఈ రహదారి రాత్రిపూట మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదని తేలింది. 
 
సూర్యాస్తమయం కాగానే ఎంజీరోడ్డుపై వ్యభిచారిణులు సంచరిస్తున్నారని, జూదం కూడా జోరుగా సాగుతోందని ఇద్దరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రివేళ ఈ రోడ్డుపై పోలీసులు కనిపించరని... కేవలం పోలీసు వాహనం మాత్రం చక్కర్లు కొడుతుందని తగినంతమంది పోలీసులు లేక ఈ రోడ్డుపై అసాంఘీక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని పలువురు వాపోయారు. 
 
ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నందున... కుటుంబసభ్యులతో ఈ ప్రాంతంలో తిరగలేమని మరో వ్యక్తి స్పష్టం చేశారు. ప్రతిరోజూ పీకల దాకా మద్యం తాగి మత్తులో తూలుతుంటారని సహారా మాల్ భద్రతాధికారి దిలీప్ సింగ్ రాథోడ్ చెప్పారు. మద్యం తాగిన మత్తులో అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్నందున రాత్రివేళ తాము ఎంజీరోడ్డుపై అడుగు పెట్టలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హత్య ఆడియెన్స్‌కు డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది : ర‌వివ‌ర్మ‌

ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

మంత్రి సీతక్క ఆవిష్కరించిన నిన్ను నన్ను కన్న ఆడదిరా సాంగ్

నిధి అగర్వాల్ ను చంపేస్తామంటూ బెదిరింపులు

నటనకు ఆస్కారమున్న డీ గ్లామరస్ రోల్ చేశా : ప్రగ్యా జైస్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments