Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు నుంచి తగ్గనున్న పెట్రోల్ - డీజిల్ ధరలు

Webdunia
శుక్రవారం, 23 జూన్ 2023 (17:51 IST)
దేశంలో పెట్రోల్ ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అయితే, ఈ ధరలు ఇప్పటికే సెంచరీని దాటేశాయి. ఒక దశలో లీటరు పెట్రోల్ ధర కొన్ని రాష్ట్రాల్లో 140 రూపాయల వరకు చేరింది. దీంతో జనం గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలపై రోజువారీ సమీక్షను నిలిపివేశాయి. ఫలితంగా గత రెండు మూడు నెలలుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి.
 
ఈ నేపథ్యంలో ఆగస్టు నెల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వ రంగ సంస్థలు భావిస్తున్నాయి. లీటరుకు రూ.4 నుంచి రూ.5 మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, చమురు సంస్థలు ఉన్నట్టుండి ఈ తరహా నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం లేకపోలేదు. ఈ యేడాది ఆఖరులో సెమీ ఫైనల్స్‌గా భావించే పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఆ తర్వాత వచ్చే యేడాది మార్చి - ఏప్రిల్ నెలల్లో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు జరిగనున్నాయి. దీంతో పెట్రోల్ ధరల పెరుగుదలపై జనాల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్రంలోని బీజేపీ పాలకులు సూచన మేరకే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ధరలను తగ్గించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments