Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగనన్న పాలనలోనే పెట్రో బాదుడు అధికం

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (07:32 IST)
ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజల్ ధరల బాదుడు అధికంగా ఉంది. ఇప్పటివరకు రాజస్థాన్​లో ఈ ధరలు ఎక్కువగా ఉండగా.. కానీ, మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లీటరు పెట్రోలుపై రూ.4, డీజిల్‌పై రూ.5 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆ ధరలు గత రాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
 
పెట్రోలు, డీజిల్‌ ధరలు బుధవారం నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే అధికంగా ఉన్నాయి. పెట్రో ధరల్లో ఇప్పటివరకు తొలిస్థానంలో నిలిచిన రాజస్థాన్‌ ఒక మెట్టు దిగొచ్చింది. లీటరు పెట్రోలుపై రూ.4, డీజిల్‌పై రూ.5 చొప్పున తగ్గిస్తున్నట్లు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. తగ్గిన ధరలు ఆ అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
 
దీంతో బుధవారం నుంచి జైపూర్‌లో పెట్రోలు లీటరు రూ.107.08. డీజిల్‌ రూ.90.70 చొప్పున లభించనున్నాయి. కానీ, ఏపీలోని విజయవాడలో ఈ ధరలు వరుసగా రూ.110.03, రూ.96.08 చొప్పున ఉన్నాయి. 
 
రాజస్థాన్‌తో పోలిస్తే.. ఏపీలో లీటరుకు పెట్రోలుపై రూ.2.95, డీజిల్‌పై రూ.5.40 అధికం. ఈ రెండు రకాల ఇంధన ధరల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తెలంగాణ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, రాష్ట్ర ప్రభుత్వాల వ్యాట్‌ సవరణల తర్వాత దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోనే పెట్రోలు ధర లీటరు రూ.105 పైబడి ఉంది. డీజిల్‌ రూ.90 పైబడిన రాష్ట్రాలు 9 ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments