ఎయిర్ ఇండియా ఇడ్లీ, సాంబార్‌లో బొద్దింక.. షాకైన ప్రయాణీకుడు..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:17 IST)
భోపాల్ నుంచి శనివారం ముంబైకి వెళ్లిన ఎయిర్ ఇండియా విమానంలో రోహిత్ రాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ప్రయాణించాడు. రోహిత్‌కు ఎయిర్ ఇండియా ఆహారం సరఫరా చేసింది. ఓ ప్యాక్‌లో ఇడ్లీ, సాంబార్, వడను అందజేసింది.
 
ఇడ్లీ, సాంబార్‌ను తింటూ వుండగా.. అందులో బొద్దింక వుండటాన్ని గమనించి షాక్ అయ్యాడు. ఈ వ్యవహారంపై రోహిత్ ఫిర్యాదు చేసినా ఎయిర్ ఇండియా సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విమానం దిగిన తర్వాత ఎయిర్ ఇండియా ఉన్నతాధికారికి రోహిత్ లేఖ రాశాడు. 
 
అయినా ఎయిర్ ఇండియా పట్టించుకోలేదు. చివరికి సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. ఎయిర్ ఇండియా ఆహారంలో బొద్దింక అంటూ రాశాడు. ఫోటోలను పోస్ట్ చేశాడు. ట్విట్టర్‌లో రోహిత్ చేసిన పోస్టు వైరలై కూర్చుంది. దీంతో ఎయిర్ ఇండియా మేనేజర్ రాజేంద్ర మల్హోత్రా రోహిత్‌తో మాట్లాడారు. 
 
రోహిత్ పంపిన లేఖ తనకు అందలేదని.. ఈ వ్యవహారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేగాకుండా ఎయిర్ ఇండియా సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి తాను చింతిస్తున్నానని.. ఇంకా బేషరతుగా క్షమాపణలు చెప్తున్నానని రాజేంద్ర మల్హోత్రా చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments