Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయల్... ఆకాశంలో హనీమూన్.. రూ.75వేలు చెల్లిస్తే... 45 నిమిషాల పాటు..

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (21:55 IST)
హనీమూన్‌ను మధురానుభూతిగా నిలుపుకోవాలనుకునే వారి కోసం లవ్ క్లౌడ్ జెట్ చార్టర్ అనే సంస్థ ఈ ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా నూతన జంటలు తమ హనీమూన్‌ను విమానాల్లో జరుపుకునేలా ప్లాన్ వేశారు. ఇందుకోసం జంటలను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్లాన్స్ కూడా అనౌన్స్ చేశారు.
 
హనీమూన్ కోసం ప్రత్యేక విమానాన్ని బుక్ చేసుకోవడానికి కేవలం 995 అమెరికన్ డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది. అంటే భారతీయ కరెన్సీలో 73 వేల రూపాయలు అన్నమాట. అయితే, ఈ మొత్తం చెల్లిస్తే 45 నిమిషాల ప్రయాణానికి మాత్రం అవకాశం ఉంటుంది. అంతకు మించి సమయం కావాలనుకుంటే.. మరింత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
 
కాగా, ఈ విమానంలో ప్రత్యేకంగా రాయల్ హనీమూన్‌కు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. రూ. 75 వేలు చెల్లిస్తే దాదాపు 45 నిమిషాల పాటు విమానం గాలిలోనే ఉంటుంది. ఇంకా సమయం కావాలనుకుంటే.. అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఈ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీస్‌లు, సదుపాయాలను చూసి మీ హనీమూన్‌ను ప్రత్యేకంగా మార్చుకోవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హనీమూన్ కోసం విమానంలో ప్రత్యేకంగా క్వీన్ బెడ్‌ ఏర్పాటు చేశారు. ఈ విమానానికి ఒకే ఒక పైలట్ ఉంటాడు. అలాగే.. పైలట్ కాక్‌పిట్ కి, విమానం ఇతర భాగానికి ఎలాంటి లింక్ ఉండదు. 
 
సో.. జంట గోప్యతకు కూడా సమస్య ఉండదు. గత ఏడు సంవత్సరాలుగా లవ్ క్లౌడ్ కంపనీ కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక సేవలను అందిస్తూ వస్తోంది. రిమాంటిక్ డిన్నర్, విమానంలో పెళ్లి ఫెసిలిటీ కూడా తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విమానంలో హనీమూన్‌కు శ్రీకారం చుట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments