Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బ్యాంకు సిబ్బందికి లంచాలుగా వజ్రాలు.. బంగారు ఆభరణాలు

దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం. గుజరాత్ (సూరత్) రాష్ట్రానికి చెందిన వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకు అధికారులను, సిబ్బందిని బురిడీ కొ

Webdunia
ఆదివారం, 4 మార్చి 2018 (10:50 IST)
దేశంలో వెలుగు చూసిన అతిపెద్ద స్కామ్‌లలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణం. గుజరాత్ (సూరత్) రాష్ట్రానికి చెందిన వజ్రాలు, బంగారు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకు అధికారులను, సిబ్బందిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.12 వేల కోట్ల మేరకు రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయాడు. 
 
అయితే, ఇన్ని వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోవడానికి ఆ బ్యాంకు సిబ్బంది పూర్తి స్థాయిలో తమవంతు సహాయసహకారాలు అందించారు. ఇందుకోసం వారికి నీరవ్ మోడీ వజ్రాలు, బంగారు ఆభరణాలను లంచాలుగా ఇచ్చాడు. ఈ విషయం సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. 
 
బ్యాంకులోని ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి బంగారు నాణాల నుంచి వజ్రాభరణాల వరకూ నీరవ్ కానుకలుగా ఇచ్చాడని, వీటి విలువ కోట్ల రూపాయలు ఉంటుందని సీబీఐ తరపు న్యాయవాది సీబీఐ కోర్టుకు వెల్లడించారు. బ్యాంకు తరపున తప్పుడు ఎల్ఓయూ (లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్)లు తీసుకునేందుకు లంచాలు ఇచ్చారని తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకూ 14 మందిని అరెస్ట్ చేశామని, వీరందరికీ నీరవ్ మోడీ, మేహుల్ చౌక్సీల నుంచి ఏదో ఒక రూపంలో లంచాలు అందాయని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments