Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జియోఫై" పైన భారీ తగ్గింపు... ఎంతో తెలుసా?

హైదరాబాద్: రిలయన్స్‌ జియో రోజుకో కొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. తాజాగా జియోఫై పోర్టబుల్‌ 4జీ రూటర్‌ పైన సరికొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. దీంతో జియోఫై రూటర్‌ 499

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (16:48 IST)
హైదరాబాద్: రిలయన్స్‌ జియో రోజుకో కొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. తాజాగా జియోఫై పోర్టబుల్‌ 4జీ రూటర్‌ పైన సరికొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. దీంతో జియోఫై రూటర్‌ 499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్‌ రూటర్‌ ధరను రూ.1999 నుంచి రూ.999కు తగ్గించిన సంగతి తెలిసిందే.
 
తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కేవలం కొత్త జియోఫై యూనిట్‌ కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ డివైజ్‌ కలిగి ఉన్నవారికి ఈ ఆఫర్‌ వర్తించదు. జూలై 3 నుంచి ఈ ఆఫర్‌ను యూజర్లకు జియో అందిస్తోంది.
 
జియోఫై క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్‌ సిమ్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్‌ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్‌ చేయించుకోవాలి. ఇలా 12 నెలల పాటు రీఛార్జ్‌ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత, తర్వాత బిల్‌ సైకిళ్లలో ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్‌ జియో అందించనుంది.
 
జియో తన పోస్ట్ పెయిడ్‌ ప్లాన్‌ రూ.199 కింద 25 జీబీ డేటాను, ఉచిత వాయిస్‌ కాల్స్‌ను, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లను, జియో యాప్స్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments