Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్యా కోసం జైలు గది.. టైల్స్ మార్చేశారు..

బ్యాంకులకు వేల కోట్ల మేర నగదు చెల్లించకుండా ఎగ్గొట్టి లండన్‌‌కు చక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండదని మాల్యా ఫి

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (14:32 IST)
బ్యాంకులకు వేల కోట్ల మేర నగదు చెల్లించకుండా ఎగ్గొట్టి లండన్‌‌కు చక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండదని మాల్యా ఫిర్యాదు చేయడంతో లండన్‌ కోర్టు జైలు వీడియో పంపించాల్సిందిగా సీబీఐని అడిగింది.


దీంతో మాల్యాను ఉంచబోయే జైలుకు సంబంధించిన వీడియోను పంపించాల్సిందిగా లండన్‌ కోర్టు గతంలో భారత్‌ అధికారులను ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు ఆర్థర్‌ రోడ్‌ జైలులోని బారక్‌ నం.12ను వీడియో తీసి పంపించారు.
 
తొలుత ఆగస్టు 10వ తేదీన సీబీఐ అధికారులు జైలు గది వీడియోను తీశారు. దాని పట్ల అసంతృప్తిగా ఉండటంతో ఆగస్టు 13న మరోసారి వీడియో తీశారు. చివరి సారిగా ఆగస్టు 16న మూడోసారి వీడియో తీసి కోర్టుకు పంపించారు.
 
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యా కోసం చక్కని జైలు గది సిద్ధమైంది. ఈ మేరకు మాల్యా కోసం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలు బారక్‌ నం.12ను సిద్ధం చేశారు. మాల్యా ఉండాల్సిన జైలు గదిలో టైల్స్‌ మార్చడంతో పాటు, గోడలకు పెయింటింగ్‌లు వేశారు. ఆయన కోసం బాత్‌రూంలో వెస్ట్రన్‌ టాయిలెట్‌ ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని మార్పులు చేసినట్లు పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్‌ ప్రమేష్‌ తెలిపారు. 
 
టాయిలెట్‌, ఫ్లోరింగ్‌ కూడా మార్చేశాం. ఇందుకోసం దాదాపు 45 మంది కార్మికులు పనిచేశారు. ఆర్థర్‌ రోడ్‌ జైలు‌లోని రెండు గదుల్లో మార్పులు చేశాం. ఒక దాంట్లో మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ ఉంటుండగా.. మరో దాన్ని మాల్యా కోసం సిద్ధం చేశామని పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments