Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యను కడతేర్చాడు..

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(

Webdunia
గురువారం, 30 ఆగస్టు 2018 (13:24 IST)
ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భార్యనే కడతేర్చాడో కసాయి భర్త. ఈ ఘటన హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణం స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న బాలవినయ్‌కు బెంగళూరులోని మేనత్త కుమార్తె దీపిక(31)తో పదేళ్ల కిందట వివాహమైంది. రెండేళ్లు కాపురం చేశాక విభేదాలు రావటంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఆరేళ్ల కుమారుడు హరిచరణ్ ఆమె వద్దే వుంటున్నాడు. అనంతరం బాలవినయ్ మరో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య దీపిక తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని హిందూపురంలో కోర్టుకెక్కింది. ఈ నెల 27న విచారణ సందర్భంగా ఆమె హిందూపురానికి కుమారుడితోపాటు వచ్చింది. కేసు చివరిదశకు రావటం, ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని తెలుసుకున్న బాలవినయ్‌ ఆమెను ఇంటికి పిలిపించుకొని దాడికి పాల్పడ్డాడు.
 
అనంతరం పోలేపల్లి వద్ద చంపి పొలాల్లో కాల్చేశాడు. హరిచరణ్‌ను బెంగళూరులోని అమ్మమ్మ వద్ద వదిలేసి వచ్చి.. భార్యను చంపేశాడు. ఈ ఘటనపై దీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులో వచ్చింది. బాలవినయ్ ప్రస్తుతం పరారీలో వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments