Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క కలం పోటుతో లక్షల కంపెనీలు రద్దు : ప్రధాని మోడీ

నల్లధనాన్ని అరికట్టేందుకు 2.1 లక్షల నకిలీ కంపెనీలను ఒక్కకలం పోటుతో రద్దు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశామని గుర్తు చేశారు. ఢిల్లీలో బుధవారం కంపెనీ సెక్రెటరీల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (09:39 IST)
నల్లధనాన్ని అరికట్టేందుకు 2.1 లక్షల నకిలీ కంపెనీలను ఒక్కకలం పోటుతో రద్దు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశామని గుర్తు చేశారు. ఢిల్లీలో బుధవారం కంపెనీ సెక్రెటరీల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిపై కొందరు నిరాశను వ్యాపింపజేయడం ద్వారా ఆనందపడుతున్నారన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై వస్తున్న విమర్శలపై స్పందించారు. నోట్ల రద్దు తమ ప్రభుత్వం తీసుకున్న అత్యంత సాహసోపేత నిర్ణయమన్నారు. 
 
నల్లధనానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇపుడు 'నిజాయితీ' శకం ఆరంభమైందని... బ్లాక్‌మనీతో లావాదేవీలు జరిపేందుకు ప్రజలు ఒకటికి 50 సార్లు ఆలోచిస్తున్నారన్నారు. జీడీపీ తగ్గడం ఇపుడు కొత్తేమి కాదన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికితీసేందుకు కఠినమైన చట్టాలు రూపొందించామని ప్రధాని పేర్కొన్నారు.
 
జాతీయ స్థూల ఉత్పత్తి మందగమనాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని, సంస్కరణలు కొనసాగిస్తామన్నారు. వర్తమాన ప్రయోజనాల కోసం దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే పని తాను ఎప్పుడూ చేయబోనని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి దిగజారిందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మండిపడ్డారు. 
 
వారు కేవలం గత రెండు త్రైమాసికాలను మాత్రమే చూస్తున్నారని, తాము సాధించిన విజయాలను చూడలేకపోతున్నారని అన్నారు. తాము ద్రవ్యోల్బణాన్ని 10 శాతం నుంచి 2.5 శాతానికి, కరెంటు ఖాతా లోటును 4 నుంచి 1 శాతానికి, ద్రవ్యలోటును 4.5 నుంచి 3.5 శాతానికి తెచ్చామని చెప్పారు. ఏప్రిల్-జూన్‌లో వృద్ధిరేటు 5.7 శాతానికి పడిపోతే నిరాశావాదులు కొంపలు మునిగినట్టు గగ్గోలు పెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ లో దర్శకుడు శంకర్ ఎక్కుపెట్టిన అస్త్రం హైలైట్ ?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments