ప్రపంచ అపరకుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ స్థానమేది?

Webdunia
బుధవారం, 15 జులై 2020 (10:48 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ అపర కుబేరుల జాబితాలో ఆయన ఆరో స్థానానికి ఎగబాకారు. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ల జాబితాలో ఆయన వారెన్ బఫెట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లను వెనక్కినెట్టి ఈ స్థానానికి చేరుకున్నారు. 
 
ఇటీవల బ్లూమ్ బెర్గ్ విడుదల చేసిన ర్యాంకుల్లో 8వ స్థానంలో నిలిచిన ముఖేశ్ కొన్ని రోజుల వ్యవధిలోనే 6వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఆయన నికర సంపద విలువ 68.3 బిలియన్ల నుంచి 72.4 బిలియన్లకు పెరిగింది.
 
కరోనా కష్టకాలంలో రిలయన్స్ జియోలో పెట్టుబడుల వరద పారిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో రిలయన్స్ షేర్ విలువ పెరిగిపోవడమే కాకుండా, ముఖేశ్ అంబానీ ఆస్తి కూడా ఒక్కసారిగా పెరిగింది. 
 
ఇక, బ్లూమ్ బెర్గ్ రియల్ టైమ్ ర్యాంకింగ్స్‌లో ఎప్పట్లాగే అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ టాప్‌లో కొనసాగుతున్నారు. ఆయన ఆస్తి విలువను 184 బిలియన్ డాలర్లుగా పేర్కొన్నారు. ఆ తర్వాత రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ (115 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (94.5 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్ బర్గ్ (90.8 బిలియన్ డాలర్లు), స్టీవ్ బామర్ (74.6 బిలియన్ డాలర్లు) ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments