Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారటోరియం 6 నెలలకు మించి ఇవ్వలేం: సుప్రీంకు తెలిపిన కేంద్రం

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2020 (17:01 IST)
కరోనా వైరస్ వ్యాప్తితో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారికి ఊరట కలిగిస్తూ కేంద్రం మారటోరియం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డీపై వడ్డీ, మారటోరియం గడువు పొడిగింపు వంటి అంశాలపై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకులు పలు విషయాలు తెలిపాయి.
 
రుణ గ్రహీతలకు కల్పించిన రుణ మారటోరియం పరిధిని మరోసారి పొడిగించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మారటోరియం 6 నెలలకు మించి ఇవ్వడం సాధ్యం కాదని ఆర్బీఐ దాఖలు చేసిన అపిడవిట్లో పేర్కొంది. కరోనా వల్ల నష్టపోయిన ఆయా రంగాలకు మరింత ఆర్థిక ఉపశమనాన్ని అందించలేమని తేల్చి చెప్పింది.
 
వడ్డీపై వడ్డీని వదులుకోవడంపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన అపిడవిట్ సంతృప్తికరంగా లేదంటూ ఇటీవల సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై కూడా కేంద్ర సర్కారు స్పష్టతనిచ్చింది.
 
మారటోరియం వ్యవధి 6 నెలలకు మించితే మొత్తం చెల్లింపులు తీరుపై ప్రభావం చూపుతుందని స్పష్టత చేశాయి. వడ్డీపై వడ్డీ మాఫీ చేయడమే కాకుండా ఇతర ఊరట కల్పించినా భారత ఆర్థిక వ్యవస్థకు, బ్యాంకింగ్ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుందని కేంద్ర సర్కారు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments