Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి మూడీస్ బూస్ట్... భారత్ రేటింగ్ పెంపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బూస్ట్ లాంటి వార్తను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అందించింది. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ అనుకూలమంటూ మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టంచేస్తూ, ప్రస్తుతం ఉన్న రేటి

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (13:54 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బూస్ట్ లాంటి వార్తను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అందించింది. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ అనుకూలమంటూ మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టంచేస్తూ, ప్రస్తుతం ఉన్న రేటింగ్‌ను బీఏఏ 3 నుంచి బీఏఏ 2కి సవరించింది. అలాగే, స్వల్పకాలిక కరెన్సీ రేటింగ్ ను పీ-3 నుంచి పీ-2కి మార్చింది. 
 
ఇదే అంశంపై ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌ను అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్న దేశంగా కూడా గుర్తించింది. జీఎస్టీ అమలుతో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోయి.. ఉత్పత్తి బాగా మెరుగుపడుతుందని అభిప్రాయపడింది. 
 
అలాగే, 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.7శాతంగా ఉంటుందని తెలిపింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని.. అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలం అని తెలిపింది. 14 సంవత్సరాల తర్వాత మూడీస్ ఏజెన్సీ భారత్‌కు మెరుగైన రేటింగ్ ఇవ్వడం తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments