Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగగా మారిన టెక్ కంపెనీ ఉద్యోగి.. దోపీడికి వెళ్లి కత్తి చూపెట్టి.. 50మందిపై అత్యాచారం

దొంగతనం చేసే ఓ దొంగ.. కత్తిని చూపి డబ్బు, నగలతో పాటు మహిళల శీలాన్ని కూడా దోచుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది మహిళలపై ఓ దొంగ అత్యాచారానికి

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (12:58 IST)
దొంగతనం చేసే ఓ దొంగ.. కత్తిని చూపి డబ్బు, నగలతో పాటు మహిళల శీలాన్ని కూడా దోచుకున్నాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50 మంది మహిళలపై ఓ దొంగ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై సైదాపేటలో పోలీసులు గురువారం రాత్రి అరివళగన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. అతనిపై ఇప్పటికే పలు దోపిడీ కేసులున్నాయి. 
 
కృష్ణగిరికి చెందిన అరివళగన్ (27) డిగ్రీ పూర్తి చేసి బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసేవాడు. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి చెన్నైకి చేరుకున్న అతడు దోపిడీలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఓసారి ఓ ఇంటికి దోపిడీ చేసేందుకు వెళ్లిన అరివళగన్‌ ఆ ఇంట్లో ఓ మహిళపై కత్తిని చూపి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఇదే తరహాలో అనేక దోపీడీలకు పాల్పడిన అరివళగన్ ఆ ఇంట వుండే మహిళల నోటిని కట్టేసి.. కత్తిని చూపి బెదిరించి ఈ అకృత్యానికి పాల్పడేవాడని.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 50మంది మహిళలపై అరివళగన్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళల వద్ద రహస్యంగా విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు. 
 
అంతేగాకుండా.. అత్యాచారానికి పాల్పడిన మహిళల ఫోన్ నెంబర్లు తీసుకుని.. వారి కుటుంబీకులతో తనతో గడిపిన వీడియోలను పంపుతానని బెదిరించేవాడని పోలీసులు తెలిపారు. ఇలా బెదిరింపులకు దిగి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడిన వారిని లోబరుచుకుని తన కోర్కెలు తీర్చుకునేవాడని వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments