Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 15న భారతదేశంలో మొట్టమొదట తయారైన ఇంటర్నెట్ కార్ ఎంజి హెక్టార్

Webdunia
మంగళవారం, 7 మే 2019 (19:05 IST)
వడోదర: ఎంజి (మారిస్ గ్యారేజెస్) మోటార్స్ ఇండియా, నేడు గుజరాత్‌లోని హలోల్ వద్ద గల తన సదుపాయం నుండి ఎంజి, మొట్టమొదటి కార్, హెక్టార్‌ను భారతదేశంలో మొట్టమొదటి ఉత్పాదక వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఎంజి హెక్టార్, భారతదేశంలోని విభిన్న వాతావరణ పరిస్థితులలో ఒక మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పరీక్షించిన తరువాత, వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించింది. విస్తృత స్థానికీకరణతో, ఎంజి హెక్టార్లో వినియోగదారుల ప్రాధాన్యతలు మరియు రహదారి పరిస్థితులకు అనుగుణంగా భారతదేశంలో 300+ కంటే ఎక్కువ నిర్దిష్ట మార్పులు చేయబడ్డాయి.
 
ఎంజి మోటార్ ఇండియా, ఎంజి హెక్టార్ ఎస్‌యువి రవాణాలను 50 నగరాలలోని 65 షోరూములతో గల తన విస్తృత నెట్వర్క్ ద్వారా తదుపరి కొన్ని వారాలలోపుగానే ప్రారంభించబోతోంది. హెక్టార్ ఎస్‌యువి, అధికారికంగా మే 15వ తేదీన, ఆవిష్కరించబడుతోంది. ఈ కార్ ప్రీఆర్డర్లను జూన్ 2019లో చేసుకోవచ్చు.
 
“మేము భారతదేశంలో మొట్టమొదట తయారైన ఎంజి హెక్టార్, ఇంటర్నెట్ కారును గుజరాత్ లోని హలోల్ తయారీ సదుపాయం నుండి మా సరికొత్త అసెంబ్లీ లైన్ నుండి, ఆవిష్కరిస్తున్నందుకు గర్వపడుతున్నాము. అత్యున్నత నాణ్యతతో కూడిన ప్రపంచవ్యాప్త తయారీ ప్రమాణాలతో, హెక్టార్ ఒక ప్రత్యేకంగా వినియోగదారు అనుకూలీకరణతో భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలకు మరియు రహదారి పరిస్థితులకు తగిన విధంగా రూపొందించబడింది. ఎంజి హెక్టార్‌తో, మేము ఎస్‌యువి విభాగంలో ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పరచాలనే లక్ష్యం కలిగిఉన్నాము," అని రాజీవ్ చాబా, ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు.
 
ఎంజి ఇండియా, ఇప్పటివరకు, 2,200 కోట్ల రూపాయాలను, తన గుజరాత్ తయారీ కర్మాగారం పునరుద్ధరించడానికి మరియు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంజి హెక్టార్ ఆవిష్కరణ కోసం పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ ఒక సరికొత్త అసెంబ్లీ లైన్, ఒక కొత్త ప్రెస్ షాప్, కొత్త బాడీ షాప్, కొత్త విడిభాగాల పంపిణీ కేంద్రం, కర్మాగారంలోపలే ఒక టెస్టింగ్ ట్రాక్ మరియు అత్యాధునిక శిక్షణా సదుపాయాన్ని, 18 నెలల అతి తక్కువ కాలంలో ఏర్పాటు చేసింది. ఎంజి వారి హలోల్ యూనిట్, ప్రస్తుతం సంవత్సరానికి 80,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
 
ఈ కర్మాగారంలో అవసరానికి తగినట్లుగా తయారీ పెంపునకు అవకాశం ఉంది. ఈ కర్మాగారం, ప్రపంచ ప్రఖ్యాత తయారీ ప్రమాణాల క్రింద పనిచేస్తూ, ప్రస్తుత ప్రమాణాలను దాటి ఉత్పాదనా పరామితులను అనుసరిస్తూ, వాహనాలను వివిధరకాల కఠినమైన పరీక్షలకు గురిచేస్తూ, నిర్వహించబడూతుంది. ఇంకా, భారతదేశానికి ప్రత్యేకంగా ఉత్పాదులను ఉత్పత్తి చేయుటకు కట్టుబడిన ఈ కార్ తయారీదారు, తన కర్మాగారంలో ఒక అంకితభావ వెండార్ పార్క్ కూడా ఏర్పరిచింది.
 
ఎంజి హెక్టార్ అత్యాధినిక సాంకేతికతతో, ఉత్తమ పనితీరు మరియు అంశాలతో రూపొందించబడింది. తదుపరి తరం ఐస్మార్ట్ సాంకేతికత, ఒక సురక్షిత, అనుసంధాన మరియు వినోదభరిత అనుభవాన్ని తన వినియోగదారులకు అందింస్తోంది. అలా, భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ కార్, విభాగంలోనే ఉత్తమమైన 10.4 అంగుళాల టచ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఎస్‌యువి విప్లవాత్మక ఓవర్ ద ఎయిర్ (ఓటిఎ) టెక్నాలజీతో, వినియోగదారులు తమ సాఫ్ట్వేర్/ఫర్మ్ వేర్, అంశాలు, థీమ్స్, మరియు ఇన్ఫోటైన్మెంట్ అంశాల అప్డేట్స్ అందుబాటులో ఉన్నప్పుడు వాటిని అప్డేట్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments