Webdunia - Bharat's app for daily news and videos

Install App

280 మార్కును చేరడం కష్టమే.. మోదీ మళ్లీ ప్రధాని ఐతే సంతోషమే: శివసేన

Webdunia
మంగళవారం, 7 మే 2019 (18:51 IST)
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపి 271 నియోజక వర్గాల్లో విజయం సాధిస్తే.. చాలా సంతోషిస్తామని.. లేని పక్షంలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రామ్ మాధవ్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. 
 
2014 ఎన్నికల్లో బీజేపీ 280 సీట్ల మార్కుకు చేరుకుంది. కానీ ప్రస్తుతం ఆ మార్కును బీజేపీ చేరుకోవడం కాస్త కష్టతరమేనని సంజయ్ రౌత్ తెలిపారు. రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానని.. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం సంతోషమే. కానీ దేశంలోనే ఏకైక అతిపెద్ద బీజేపీ ప్రస్తుతం 280-282 ఫిగర్‌ను చేరుకోవడం కష్టతరమేనని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. 
 
అయినా మిత్రపక్షాలతో చేతులు కలిపి నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాన మంత్రి పగ్గాలు చేపట్టడంపై శివసేన హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. శివ మాధవ్ వ్యాఖ్యల్లో నిజం వుందని.. శివసేన కూడా ఎన్డీయేలో భాగమని మాధవ్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తానని చెప్పుకొచ్చారు. ఇలా మిత్ర పక్షాలతో ఎన్డీయే కలిసి ముందుకెళ్తే.. ఈ క్రమంలో మోదీ ప్రధాని అయితే సంతోషిస్తామని సంజయ్ రౌత్ మీడియాతో వెల్లడించారు. 
 
కాగా ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీకి 18 మంది లోక్‌సభ సభ్యులున్న సంగతి తెలిసిందే. బీజేపీకి శివసేన ప్రధాన మిత్రపక్షం కావడం గమనార్హం. ఈ పార్టీ మహారాష్ట్రలోని బీజేపీ సర్కారులో భాగం కావడం విశేషం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments