Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాది సూపర్‌స్టార్‌ నాగార్జునతో ‘ఆమ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించిన మజా

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (23:56 IST)
కోకాకోలా ఇండియా యొక్క దేశీయంగా అభివృద్ది చేసిన మామిడి పానీయం, ఇండియా, ఆగ్నేయాసియాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మజా ఇప్పుడు తమ నూతన ‘ఆమ్‌వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ’ ప్రచారం ప్రారంభించింది. ప్రస్తుతం, కోకాకోలా ఇండియా బ్రాండ్‌కు అగ్రగామి బ్రాండ్లలో ఒకటిగా మాజా నిలిచింది. స్ర్పైట్‌ మరియు థమ్సప్‌లు 2022లో ఒక బిలియన్‌ యుఎస్‌డీ బ్రాండ్‌గా నిలిస్తే, 2023లో మజాను ఒక బిలియన్‌ డాలర్ల  మార్కుకు చేర్చడానికి లక్ష్యంగా చేసుకుంది.
 
తాజా ప్రచారంలో వెటరన్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, సుప్రసిద్ధ నటి పూజా హెగ్డే తో పాటుగా దక్షిణాది సూపర్‌స్టార్‌ నాగార్జున కూడా కనిపించనున్నారు. ఇటీవలనే ఆయన మజా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఈ నూతన ప్రచారం గురించి కోకా కోలా ఇండియా, ఆగ్నేయాసియా డైరెక్టర్‌- మార్కెటింగ్‌, న్యూట్రిషన్‌ విభాగం అజయ్‌ కొనాలీ మాట్లాడుతూ ‘‘మజా ఓ వారసత్వ భారతీయ బ్రాండ్‌. 1976 నుంచి ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దశాబ్దాలుగా భారతీయులు అభిమానించే మ్యాంగో డ్రింక్‌గా ఇది నిలిచింది. సాటిలేని రుచులతో కూడిన అసలైన మామిడితో అసాధారణ వృద్ధికి ఇది తోడ్పడుతుంది. మా తాజా ప్రచారం, ఆమ్‌ వాలీ దిల్‌దారీ, బినా నామ్‌ వాలీ దిల్‌దారీ  ద్వారా, అసలైన సంతోషం మరియు ఆనందాన్ని నిస్వార్ధమైన దాతృత్వం ద్వారా వెల్లడిస్తున్నాము.  బచ్చన్‌, పూజాహెగ్డే మరియు నాగార్జునలు మా బోర్డ్‌ పై రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు
 
నూతన మజా ప్రచారం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ ‘‘ఈ బ్రాండ్‌ నా పాత రోజులను గుర్తుకు తీసుకువచ్చింది. మామిడి పళ్లను ఆ రోజుల్లో ఎంతగానో ఆస్వాదించాను. ఈ బ్రాండ్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను ’’అని అన్నారు. ఓగ్లీవీ ఇండియా చీఫ్‌ క్రియేటివ్‌ ఆఫీసర్‌ సుకేష్‌ నాయక్‌ మాట్లాడుతూ ‘‘ఇతరులకు సహాయం చేయడంలోని అందాన్ని ఈ ప్రచారం ద్వారా వెల్లడిస్తున్నాము. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, పూజా హెగ్డే లాంటి బ్రాండ్‌ అంబాసిడర్‌ల ద్వారా ఈ సందేశాన్ని మరింత ఉన్నతంగా వెల్లడిస్తున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments