Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెలవు పెట్టకుండా పనిచేశాడు.. రూ.19.4 కోట్లు పొందాడు.. ఎలా?

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (14:53 IST)
సెలవు పెడితే కోట్లు పోవడమేంటని ఆలోచిస్తున్నారా, నిజమేనండీ బాబు.. ప్రముఖ సంస్థ ఎల్&టి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పని చేసిన అనిల్ కుమార్ మనిభాయ్ నాయక్ ఇటీవల పదవీ విరమణ పొందగా ఆయనకు రిటైర్‌మెంట్ క్రింద సుమారు 2.7 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. కానీ ఇంతకంటే భారీ మొత్తంలో అక్షరాలా 19.4 కోట్ల రూపాయలు ఆయనకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌లో లభించింది. 
 
అనిల్ కుమార్ 1965లో జూనియర్ ఇంజినీర్‌గా ఇందులో చేరారు. ఆ తర్వాత పట్టుదలతో కష్టపడి పని చేసి అంచలంచెలుగా ఎదుగుతూ ఛైర్మన్ హోదాను సంపాదించుకున్నారు. దాదాపు 50 ఏళ్ల కార్యాలయ జీవితంలో ఈయన సెలవు పెట్టిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఎప్పుడూ పీకల్లోతు పనిలో మునిగి ఉండే ఈయన బిజీగా ఉండేవాడు. దీంతో సెలవులన్నీ అలాగే మిగిలిపోయాయి. 
 
ఇప్పుడు రిటైర్‌మెంట్ టైమ్‌లో లీవులను ఎన్‌క్యాష్ చేయడానికి లెక్కకట్టగా మొత్తంగా 19.4 కోట్ల రూపాయలుగా తేలింది. కమిట్‌మెంట్‌తో పనిచేస్తే ఆత్మ సంతృప్తే కాదు లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుందని ఆయన నిరూపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments