Webdunia - Bharat's app for daily news and videos

Install App

అచీవర్స్ డే సందర్భంగా అత్యుత్తమ విద్యార్థులకు అవార్డులు అందజేసిన కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్

ఐవీఆర్
సోమవారం, 19 మే 2025 (16:03 IST)
కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ తమ త్రయ్మాసిక స్టూడెంట్స్ అచీవ్‌మెంట్స్ అవార్డ్ వేడుక 2025ను ఉత్సాహంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం విద్యా, సహ-పాఠ్య, అదనపు-పాఠ్యేతర విభాగాలలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి, గౌరవించడానికి ఒక వేదికగా పనిచేసింది, ఇది కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లలో సమగ్ర అవగాహన కలిగిన వ్యక్తులను పెంపొందించడానికి చూపే నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
 
అకడమిక్ ఎక్సలెన్స్ సర్టిఫికేట్, సహ-పాఠ్య కార్యకలాపాలలో అచీవ్‌మెంట్ సర్టిఫికేట్, ఎక్స్‌ట్రా-కరిక్యులర్ యాక్టివిటీలలో ఎక్సలెన్స్ సర్టిఫికేట్, అటెండెన్స్ సర్టిఫికేట్, ప్రతిష్టాత్మక స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సహా వివిధ విభాగాల కింద విద్యార్థులను సత్కరించారు. ఎంబిఏ, బీబీఏ, బిఎస్‌సి. యానిమేషన్-గేమింగ్, ఎంబిఏ ఫిన్‌టెక్ వంటి విభిన్న ప్రోగ్రామ్‌ల నుండి విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయబడ్డాయి.
 
సమగ్ర శ్రేష్ఠతను సూచించే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎంబిఏ 2వ సంవత్సరం నుండి బి. శ్రావ్య, మనీష్ సిర్కార్, నిశాంత్ కులకర్ణి (స్పెషల్ మెన్షన్)లకు ప్రదానం చేశారు. బీబీఏ 3వ సంవత్సరం నుండి రాకేష్ జాగర్లమోడి, జాన్వి ధారా; బిబిఏ ఐటి 3వ సంవత్సరం నుండి హేమా సురవరపు అంకిత్ కుమార్ వుక్కల్కర్; బిఎస్ సి.. యానిమేషన్ 3వ సంవత్సరం నుండి తరుణ్ కిషన్ ఉన్నారు.
 
విద్యార్థులను అభినందించిన, కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ మాట్లాడుతూ, “విద్యాపరంగా మాత్రమే కాకుండా సామాజికంగా బాధ్యతాయుతంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మంచి వ్యక్తులను పెంపొందించడంను మేము విశ్వసిస్తున్నాము. అచీవర్స్ డే అనేది ఆ లక్ష్య సాకరం గుర్తించటానికి చేసే ఒక వేడుక- ఇక్కడ కృషి, సృజనాత్మకత, క్రమశిక్షణ కలిసి వస్తాయి. అవార్డు గ్రహీతలందరినీ నేను అభినందిస్తున్నాను. ప్రతి విద్యార్థి జీవితంలోని అన్ని కోణాలలో రాణించడానికి కృషి చేస్తూ ఉండాలని ప్రోత్సహిస్తున్నాను” అని అన్నారు.
 
కెఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్‌లో జరిగిన అచీవర్స్ డే వేడుక విద్యార్థులు, అధ్యాపకులపై శాశ్వత ముద్ర వేసింది. కేవలం అవార్డుల కార్యక్రమం కంటే, ఇది క్యాంపస్ అంతటా శ్రేష్ఠత, క్రమశిక్షణ, సమగ్ర అభివృద్ధి సంస్కృతిని బలోపేతం చేసింది. విద్యార్థులు తగిన గుర్తింపుతో వెళ్తున్న వేళ, వారు తమతో పాటు కొత్త ఉద్దేశ్యం, సంకల్పం, గర్వాన్ని తీసుకువచ్చారు. డీన్ డాక్టర్ ఆనంద్ బేతపూడి పర్యవేక్షణలో, ఈవెంట్ కన్వీనర్ డాక్టర్ జయవాణి మజుందార్, అధ్యాపక సభ్యులు, సిబ్బంది అంకితభావంతో, ఈ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించబడింది, అంతటా దాని ప్రేరణాత్మక స్వరం, గొప్పతనాన్ని కొనసాగించింది. కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కెఎల్ హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్, జ్ఞానం కలిగిన, విలువలతో నడిచే, వేగంగా మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచ పౌరులను సృష్టించాలనే దాని లక్ష్యం ముందుకు తీసుకువెళుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments