Webdunia - Bharat's app for daily news and videos

Install App

కియా మోటార్స్‌ నుంచి పూర్తి సరికొత్త స్మార్ట్‌ అర్బన్‌ కంపాక్ట్‌ ఎస్‌యువీ సోనెట్‌

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (19:17 IST)
ప్రపంచంలో అతిపెద్ద ఆటోమేకర్లలో ఒకటైన కియా మోటార్స్‌ కార్పోరేషన్‌ నేడు ప్రపంచం కోసం తమ కియా సోనెట్‌ను డిజిటల్‌‌గా ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో ఉన్న కియా యొక్క అత్యాధునిక ఫ్యాక్టరీలో తయారైన సోనెట్‌, కియా యొక్క పూర్తి సరికొత్త అర్బన్‌ కంపాక్ట్‌ ఎస్‌యువీగా నిలుస్తుంది. అంతేకాదు, సెల్టోస్‌ తరువాత కియా విడుదల చేసిన మేడ్‌ ఇన్‌ ఇండియా అంతర్జాతీయ ఉత్పత్తిగా నిలుస్తుంది. దూసుకుపోతున్న కంపాక్ట్‌ ఎస్‌యువీ విభాగంలో కియా మోటార్‌ యొక్క ప్రవేశానికి ప్రతీకగా ఈ నూతన సోనెట్‌ నిలుస్తుంది మరియు తమ శ్రేణిలో మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లతో నూతన బెంచ్‌మార్క్స్‌ను సృష్టిస్తుంది.
 
ఉత్పత్తికి సిద్ధమైన ఈ మోడల్‌ యొక్క అంతర్జాతీయ ఆవిష్కరణ, ఫిబ్రవరి 2020లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో వద్ద విడుదల చేసిన సోనెట్‌ నేపథ్యాన్ని అనుసరించి జరిగింది. త్వరలోనే భారతదేశంలో ఈ నూతన కారు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. దీనిని అనుసరించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి కియా యొక్క గ్లోబల్‌ మార్కెట్‌లలో అమ్మకాలు జరుగనున్నాయి.
 
‘‘సున్నితమైన డిజైన్‌ మరియు ప్రపంచ శ్రేణి నాణ్యతతో పాటుగా ఆశ్చర్యపరిచే శక్తిని అందించే ఉత్పత్తుల ద్వారా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది కియా మోటార్స్‌. పూర్తి సరికొత్త సోనెట్‌కు సంబంధించి ప్రతి ఒక్క అంశమూ వినూత్నంగా కియా  కావడమే కాదు అటు డ్రైవర్లతో పాటుగా ఇటు ప్రయాణీకులకు సైతం ఆనందాన్ని అందిస్తుంది’’ అని హో సంగ్‌ సాంగ్‌, అధ్యక్షులు మరియు సీఈవో–కియా మోటార్స్‌ కార్పోరేషన్‌ అన్నారు.
 
హో సంగ్‌ మాట్లాడుతూ ‘‘దీనియొక్క దూకుడు మరియు ఆధునిక రూపకల్పన భాష, సవారీ చేసేందుకు వినోదాన్ని అందించే లక్షణాలు మరియు కియా యొక్క అత్యాధునిక హైటెక్‌ ఫీచర్లుతో ప్రాధాన్యతా బ్రాండ్‌గా కియాను  నిలుపాలనే మా లక్ష్యానికి ఆశ్చర్యార్థక స్థానాన్ని సోనెట్‌ అందిస్తుంది, మరీముఖ్యంగా మిల్లీనియల్‌ మరియు జెన్‌ జెడ్‌ వినియోగదారుల నడుమ ! భారతదేశంలో వృద్ధి చెందుతున్న ఎస్‌యువీ మార్కెట్‌ అవసరాలను సోనెట్‌ తీర్చడమే కాదు, కియా బ్రాండ్‌ పట్ల మరింత విస్తృత శ్రేణి వినియోగదారులు ఆకర్షితులు కావడానికి సైతం తోడ్పడనుంది’’ అని అన్నారు.
 
‘‘సోనెట్‌‌ను పరిచయం చేస్తుండటం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ప్రపంచం కోసం రూపుదిద్దుకున్న భారతదేశపు తయారీ ఇది. సెల్టోస్‌ మరియు కార్నివాల్‌ విజయం తరువాత,  తీరని అవసరాలు మరియు వినియోగదారుల ఆకాంక్షలను సోనెట్‌తో తీర్చడం ద్వారా కియా ఇప్పుడు భారతదేశంలోని మరో మార్కెట్‌ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురాగలదనే విశ్వాసంతో ఉన్నాం’’ అని కూఖ్యున్‌ షిమ్‌, ఎండీ అండ్‌ సీఈఓ–కియా మోటార్స్‌ ఇండియా అన్నారు.
కూఖ్యున్‌ షిమ్ మాట్లాడుతూ ‘‘నాణ్యత, రూపకల్పన, సాంకేతికత, ఫీచర్లు మరియు డ్రైవబిలిటీతో అత్యున్నత శ్రేణి అనుభవాలను అందించే రీతిలో  రూపకల్పన చేసి అభివృద్ధి చేయబడిన  కియా సోనెట్‌, విస్తృత శ్రేణి వినియోగదారులను ఆకట్టుకుంటుంది.  ఈ సోనెట్‌ను అనంతపూర్‌లోని మా అత్యాధునిక ప్లాంట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఉత్పత్తి చేయనున్నాము మరియు నూతన వినియోగదారులతో పాటుగా బ్రాండ్‌ యొక్క ప్రస్తుత వినియోగదారులను సైతం ఒకే రీతిలో ఆకట్టుకోగలదనే విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు.
 
పూర్తి సరికొత్త సోనెట్‌లో కియా యొక్క డీఎన్‌ఏ అయినటువంటి  భావావేశ శైలితో పాటుగా ప్రీమియం మరియు యూత్‌ఫుల్‌ అప్పీల్‌తో రహదారిపై బలమైన ఉనికిని సృష్టించనుంది. నమ్మకమైన , కంపాక్ట్‌ బాడీలో శక్తివంతమైన వైఖరిని ప్రదర్శిస్తూ , ఈ సోనెట్‌   ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై వైవిధ్యంగా నిలిచేందుకు విస్తృత శ్రేణి స్టైలింగ్‌ లక్షణాలను ప్రదర్శిస్తుంది. దీనిలో కియా యొక్క సిగ్నేచర్‌ టైగర్‌ నోస్‌ గ్రిల్‌ తాజా వివరణ;  గుండె యొక్క విద్యుత్‌ నరాల ఆకృతిలో హార్ట్‌ బీట్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ (పగటిపూట రన్నింగ్‌ లైట్లు)చేత చుట్టబడటంతో పాటుగా ఆకర్షణీయమైన ఫ్రంట్‌ స్కిడ్‌ ప్లేట్‌ కింద ఉంటుంది. దీనియొక్క స్పోర్టీ సిల్‌హ్యుటీ వినూత్నమైన డిజైన్‌ మరియు దీనియొక్క సీ–పిల్లర్‌ ఆకృతితో మెరుగుపరచబడటంతో పాటుగా వ్రాప్‌ఎరౌండ్‌ వెనుక విండ్‌స్ర్కీన్‌తో సరిపోలుతుంది. ఈ హార్ట్‌బీట్‌ ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌ వెనుక వైపు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
 
లోపల, సోనెట్‌ను డ్రైవర్‌ చుట్టూ, చక్కగా తీర్చిదిద్దిన, అతి సులభంగా వినియోగించతగిన అనుసంధానిత వినోదం మరియు క్లస్టర్‌ ఇంటర్‌ఫేస్‌ మరియు అత్యున్నత నాణ్యత మెటీరియల్స్‌తో రూపకల్పన చేశారు. సౌకర్యవంతమైన ఎక్స్‌టీరియర్‌ కొలతలతో పాటుగా, సోనెట్‌ యొక్క ఇంటీరియర్‌ విశాలమైన, సౌందర్యవంతమైన ప్రదేశాన్ని ప్రయాణీకులందరికీ అందిస్తుంది.
 
సోనెట్‌ను బహుళ పవర్‌ట్రెయిన్‌ అవకాశాలలో అందిస్తున్నారు. ఈ విభాగంలో అన్ని అవసరాలనూ వర్ట్యువల్‌గా ఇది తీర్చనుంది. రెండు గ్యాసోలిన్‌ ఇంజిన్స్‌ – వైవిధ్యమైన స్మార్ట్‌స్ట్రీమ్‌ 1.2 లీటర్‌ నాలుగు సిలెండర్‌ మరియు శక్తివంతమైన 1.0 టీ–జీడీఐ (టర్బోచార్జ్డ్‌ గ్యాసోలిన్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌) మరియు సమర్థవంతమైన 1.5 లీటర్‌ సీఆర్‌డీఐ డీజిల్‌ ఇంజిన్‌లు ఐదు ట్రాన్స్‌మిషన్స్‌ అవకాశాలతో లభిస్తాయి.  వీటిలో ఐదు మరియు ఆరు స్పీడ్‌ మాన్యువల్స్‌, ఒక స్పష్టమైన సెవెన్‌–స్పీడ్‌ డీసీటీ సిక్స్‌–స్పీడ్‌ ఆటోమేటిక్‌ మరియు కియా యొక్క విప్లవాత్మక నూతన సిక్స్‌ స్పీడ్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ ఇంటిలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఐఎంటీ) సైతం ఉన్నాయి. కియా నుంచి సాంకేతికంగా అత్యున్నత ఆవిష్కరణ ఐఎంటీ. ఇది అలసట లేని డ్రైవింగ్‌ను అందిస్తుంది. దీనిలో క్లచ్‌ పెడల్‌ ఉండదు. అయినప్పటికీ సంప్రదాయ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌లాగానే డ్రైవర్‌కు నియంత్రణను అందిస్తుంది. ఈ విభాగంలో మొట్టమొదటిసారిగా, సోనెట్‌ ఇప్పుడు 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను సిక్స్‌–స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో అందిస్తుంది.
 
సోనెట్‌ యొక్క డైనమిక్స్‌ మరియు సస్పెన్షన్‌ సెటప్‌ను దీని యొక్క ఉత్సాహభరితమైన డిజైన్‌, కియా యొక్క స్పోర్టీ, యూత్‌ఫుల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కు సరిపోయే రీతిలో కియా ఇంజినీర్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు మరియు ఇది ఔత్సాహికులకు అత్యున్నత డ్రైవింగ్‌ అనుభూతులను అందిస్తుంది.
 
విస్తృతశ్రేణిలో వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా, సోనెట్‌ను డ్యూయల్‌ ట్రిమ్‌ కాన్సెప్ట్‌లో అందిస్తున్నారు. దీనిలో స్పోర్టీ జీటీ–లైన్‌ ట్రిమ్‌ సైతం ఉంది. ఇది ఔత్సాహికుల కోసం సోనెట్‌ యొక్క రేసీ అప్పీల్‌ను దాని యొక్క బహుళ డిజైన్‌, ఫంక్షనల్‌ అంశాల ద్వారా లోపల మరియు బయట అందిస్తుంది. ఐటీ–లైన్‌ మోడల్స్‌ సోనెట్‌కు అదనపు స్పోర్టీనెస్‌ను అందించడంతో పాటుగా రోడ్డుపై దీని యొక్క శక్తివంతమైన ఉనికిని సైతం ప్రదర్శిస్తుంది.
అంతేనా, సోనెట్‌లో ఈ విభాగంలో మొట్టమొదటిసారి అనతగ్గ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. ఇవి సౌకర్యవంతమైన, సురక్షితమైన, గరిష్ట డ్రైవింగ్‌ ఆనందాన్ని వినియోగదారులకు అందిస్తాయి. వీటిలో:
 
అతిపెద్ద మరియు తమ శ్రేణిలో అత్యుత్తమమైన 10.25  అంగుళాల (26.03 సెంటీమీటర్లు) హెచ్‌డీ టచ్‌ స్ర్కీన్‌ , నేవిగేషన్‌ మరియు లైవ్‌ ట్రాఫిక్‌ పరిస్థితులను సైతం చూపుతుంది.
వైరస్‌ భద్రతతో స్మార్ట్‌ప్యూర్‌ ఎయిర్‌ ఫ్యూరిఫైయర్‌.
సబ్‌ ఊఫర్‌తో  బోస్‌ ప్రీమియం  ఏడు స్పీకర్ల  ఆడియో.
వెంటిలేటెడ్‌ డ్రైవర్‌ మరియు ముందు ప్రయాణీకుల సీట్లు.
ఎల్‌ఈడీ సౌండ్‌ మూడ్‌ లైటింగ్‌.
 
యువీఓ కనెక్ట్‌ మరియు స్మార్ట్‌ కీ ద్వారా ఆటోమేటిక్‌ మరియు మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కోసం రిమోట్‌ ఇంజిన్‌ స్టార్ట్‌
ఓవర్‌ ద ఎయిర్‌ (ఓటీఏ) మ్యాప్‌ అప్‌డేట్స్‌.
మల్టీ డ్రైవ్‌ మరియు ట్రాక్షన్‌ మోడ్స్‌ మరియు ఆటోమేటిక్‌ మోడల్స్‌ కోసం గ్రిప్‌ కంట్రోల్‌.
కూలింగ్‌ ఫంక్షన్‌తో వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌.
వినియోగదారుల అంతర్దృష్టుల ఆధారిత ఉత్పత్తి ఆవిష్కరణ మరియు ఓరియెంటేషన్‌కు నిదర్శనం పూర్తి సరికొత్త కియా సోనెట్‌. సాంకేతికత పట్ల అమిత అభిరుచి కలిగిన, ఔత్సాహిక మరియు సామాజికంగా అత్యున్నతంగా అనుసంథానించబడే యువతరాన్ని ఇది లక్ష్యంగా చేసుకుంది. ఈ పండుగ సీజన్‌లో భారతదేశంలో కియాను ఆవిష్కరించనున్నారు. దీనిని ప్రతి ఆరు నుంచి 9 నెలల కాలంలో పూర్తి సరికొత్త ఉత్పత్తిని విడుదల చేస్తామనే కియా మోటార్స్‌ ఇండియా యొక్క వాగ్ధానానికి అనుగుణంగా ఇది ఉంటుంది.
 
ప్రధాన ఆకర్షణలు:
కియా మోటార్స్‌ ఇండియా మరియు దక్షిణ కొరియాలోని కియా యొక్క అంతర్జాతీయ ఆర్‌ అండ్‌ డీ  ప్రధాన కార్యాలయం సంయుక్తంగా  పూర్తి సరికొత్త సోనెట్‌ను పూర్తిగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దాయి. సోనెట్‌ యొక్క ఉత్పత్తిని భారతదేశ వ్యాప్తంగా విస్తృతశ్రేణి మార్కెట్‌ అంచనాలకనుగుణంగా ఆరంభించారు. మరీముఖ్యంగా దీనియొక్క డిజైన్‌, ఇంజిన్‌ మరియు ట్రాన్స్‌మిషన్‌ ట్యూనింగ్‌ మరియు లక్షణాలు, సస్పెన్షన్‌ లక్షణాలు మరియు ఇది అందించే హై టెక్‌ ఫీచర్లకు ఈ మార్కెట్‌  శోధన దోహదపడింది.
 
భారతదేశంలో విస్తృతస్థాయిలో సోనెట్‌ రోడ్డు పరీక్షలను ఎదుర్కొంది. భారతదేశంతో పాటుగా దక్షిణ కొరియా ఇంజినీర్లు సోనెట్‌ ప్రోటోటైప్‌ వాహనంలో ఒక లక్షకు పైగా కిలోమీటర్లను విభిన్నమైన భూభాగాలు, డ్రైవింగ్‌ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులలో ప్రయాణించారు. ఈ ఫలితమే కంపాక్ట్‌ ఎస్‌యువీ. రోడ్డు మీద ప్రతి ఒక్కరూ తల ఎత్తి చూసుకునే రీతిలోని డిజైన్‌ కలిగి ఉంది. ఆహ్లాదకరమైన డ్రైవింగ్‌ అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దబడటంతో పాటుగా ప్రపంచంలో అగ్రశ్రేణి నాణ్యతా ప్రమాణాలతో రూపొందించబడింది. తమ విభాగంలో అత్యుత్తమ సౌకర్యం, సౌలభ్యం, భద్రత మరియు ఫీచర్లను అందిస్తుంది.
డిజైన్‌
దక్షిణ కొరియాలోని నామ్యాంగ్‌ వద్దనున్న కియా డిజైన్‌ సెంటర్‌ మరియు భారతదేశంలో ఉన్న కియా డిజైన్‌ టీమ్‌  యొక్క సహకార ప్రయత్నం కియా సోనెట్‌ యొక్క శక్తివంతమైన  డిజైన్‌. ఫిబ్రవరి 2020లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పో వద్ద కంపాక్ట్‌ ఎస్‌యువీ విభాగంలో కియా ప్రవేశాన్ని తొలిసారిగా ప్రపంచం వీక్షించింది. అక్కడ కియా సోనెట్‌ స్మార్ట్‌ అర్బన్‌ ఎస్‌యువీ నేపథ్యం ప్రదర్శించారు. ఉత్పత్తికి సిద్ధమైన మోడల్‌ను  అత్యంత పోటీ కలిగిన ఈ విభాగంలో వైవిధ్యమైన రీతిలో ఉండే డిజైన్‌తో, స్పోర్టీ, యవ్వన లుక్‌తో తీర్చిదిద్దారు. అత్యాధునిక శైలి ధోరణుల స్ఫూర్తితో పాటుగా సంప్రదాయ భారతీయ వారసత్వం, సంస్కృతితో తీర్చిదిద్దిన కియా సోనెట్‌ యొక్క ఎక్స్‌టీరియర్‌ శైలి పూర్తి వైవిధ్యంగా ఉంటుంది. అది తమ విభాగంలో మాత్రమే కాదు, సాధారణంగా ఎస్‌యువీలలో కూడా ఈ వైవిధ్యతను చూపుతుంది.
 
ప్రతి అంగుళం కియా ఎస్‌యువీగా సోనెట్‌ను మలచడానికి కియా యొక్క అవార్డు గెలుచుకున్న డిజైన్‌ బలాలు తోడ్పడ్డాయి. ఇది బ్రాండ్‌ యొక్క ఆత్మవిశ్వాసానికి, హృదయ పూర్వకంగా యువత ధోరణి, స్పోర్టీ, తిరుగుబాటు వైఖరి మరియు వైల్డ్‌ –బై–డిజైన్‌ విధానానికి నమూనాగా చెప్పవచ్చు. ఈ ఫలితమే ఆకట్టుకునే ఎస్‌యువీ డిజైన్‌ మరియు ఎదురులేని రీతిలో రోడ్డు మీద ఉనికి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ తనవైపు తలతిప్పి చూసేలా చేస్తుంది.
 
ముందు భాగంలో, ఈ బ్రాండ్‌ యొక్క సిగ్నేచర్‌ డిజైన్‌ లక్షణం– ‘కియా టైగర్‌ నోస్‌ గ్రిల్‌’ ఉంటుంది. సోనెట్‌ యొక్క వ్యక్తిత్వంను ఇది పునర్నిర్వచిస్తుంది. దీని చివరలు ‘హార్ట్‌ బీట్‌’ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు మరియు ఆకర్షణీయమైన రీతిలో ముందు భాగం దిగువలో ఉన్న  స్కిడ్‌ ప్లేట్స్‌, సోనెట్‌ యొక్క కూృరమైన స్వభావాన్ని వెల్లడిస్తాయి. ఈ టైగర్‌ నోస్‌ గ్రిల్‌ లోపల, దీనియొక్క క్లాసీ క్రోమ్‌ మరియు డైమండ్‌ నూర్లింగ్‌ నమూనా, వైవిధ్యంగా ఉండటంతో పాటుగా త్రికోణాకృతి జామెట్రిక్‌ డిజైన్‌ స్ఫూర్తిని  భారతదేశపు ప్రతిష్టాత్మక దిగుడుబావుల స్ఫూర్తితో తీర్చిదిద్దారు. ఈ గ్రిల్‌ మెష్‌ డిజైన్‌, అధునాతన గణితం, సైన్స్‌ మరియు ఆర్కిటెక్చర్‌లో భారతదేశపు చారిత్రాత్మక బలాలకు నివాళిగా ఉంటుంది.
 
బలమైన, స్పోర్టీ లక్షణాన్ని ఈ ప్రొఫైల్‌ అందిస్తుంది. ఇందుకు హుడ్‌ మరియు బంపర్‌ యొక్క ఆకృతి కారణం. నిటారుగా ఉన్న వైఖరి కోసం కౌల్‌ పాయింట్‌ను వెనుక్కి నెట్టడంతో పాటుగా బలీయంగా చదునుచేయబడ్డ ఏ–పిల్లర్‌ మరియు శైలిని ప్రతిబింబించే రౌండ్‌ రూఫ్‌లైన్‌ ఉన్నాయి. వెనుక వైపు, హార్ట్‌ బీట్‌ ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌ మరియు దీని యొక్క వినూత్నమైన రిఫ్లెక్టర్‌ అలంకరణ సోనెట్‌కు మరింత ఉత్తమమైన ఉనికిని అందించడంతో పాటుగా వెడల్పుగా ఉందన్న భావన అందిస్తుంది. వెనుక వైపు ఉన్న ఇతర ఆకర్షణలలో స్పోర్టీ డ్యూయల్‌ మఫ్లర్‌ డిజైన్‌ మరియు డిఫ్యూజర్‌ ఫిన్‌ రియర్‌ స్కిడ్‌ ప్లేట్‌ ఉంటాయి.
 
సోనెట్‌ యొక్క లైటింగ్‌, ఈ విభాగంలో మిగిలిన ప్రతి ఒక్కదానినుంచి దీనిని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆభరణాల తరహా ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌ ఫ్రేమ్‌, ఈ కారుకు ముఖచిత్రంగా హార్ట్‌బీట్‌ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో ఉంటుంది. వీటితో సమగ్రపరిచిన ఇండికేటర్లు మరియు అదే తరహా ఎల్‌ఈడీ టైల్‌ ల్యాంప్స్‌, సోనెట్‌ యొక్క కూృర వ్యక్తిత్వంను తమ డిజైన్‌ ద్వారా వెలుపలికి తీసుకువస్తాయి. రేసీ డిజైన్‌లో చూడగానే ఆకట్టుకునే క్రిస్టల్‌ కట్‌ అల్లాయ్స్‌పై సవారీ చేసే కియా యొక్క సోనెట్‌, మొత్తంమ్మీద చూడగానే, శక్తివంతమైన వైఖరితో, ధృడమైన, స్పోర్టీ సిల్హౌట్‌గా చూడకుండా ఉండలేమన్న భావనను అందిస్తుంది.
 
అంతేకాదు, సోనెట్‌ను ఎనిమిది వరకూ మోనోటోన్‌ మరియు మూడు డ్యూయల్‌ టోన్‌ ఎక్స్‌టీరియర్‌ రంగుల అవకాశాలతో అందిస్తున్నారు. సోనెట్‌ను డ్యూయల్‌ ట్రిమ్‌ కాన్సెప్ట్‌తో అందిస్తున్నారు. దీనిలో స్పోర్ట్స్‌ స్ఫూర్తితో తీర్చిదిద్దిన జీటీ–లైన్‌ ట్రిమ్‌ సైతం ఉంది. కియా యొక్క స్ఫూర్తి మరియు విలాసాన్ని ప్రదర్శించే స్పష్టమైన వ్యక్తీకరణను అదనపు స్పోర్టీనెస్‌, విలాసం, భద్రత మరియు ధోరణిని తమ సోనెట్‌ ద్వారా కోరుకునే వినియోగదారులకు అందిస్తుంది.
 
ఇంటీరియర్‌
లోపల, అధునాతనమైన మరియు ఆకర్షణీయమైన క్యాబిన్‌ను మృదువైన, ఆకట్టుకునే డ్యాష్‌బోర్డ్‌తో హృదయపరంగా యువ భావాలు కలిగి ఉండటంతో పాటుగా ఎల్లప్పుడూ కనెక్ట్‌ అయి ఉండే వినియోగదారులకు సోనెట్‌ అందిస్తుంది. డ్రైవర్‌ మరియు ప్రయాణీకుల సౌకర్యం మనసులో ఉంచుకుని సోనెట్‌ యొక్క ఇంటీరియర్స్‌ అత్యాధునిక, శక్తివంతమైన, బోల్డ్‌ ఔట్‌లుక్‌ను అందిస్తాయి. తెలివైన ప్యాకేజింగ్‌, అపారమైన లెగ్‌రూమ్‌, హెడ్‌రూమ్‌ మరియు షోల్డర్‌ రూమ్‌ను ఇది ప్రయాణీకులకు అందిస్తుంది మరియు భారీ ట్రంక్‌ను సైతం సృష్టిస్తుంది.
 
ఆకర్షణీయమైన మరియు క్లిష్టతలేని సెంటర్‌ కన్సోల్‌ హై –టెక్‌ అనుభూతులను అందిస్తుంది మరియు సోనెట్‌ యొక్క విభాగంలో అత్యున్నత ఫీచర్లను సైతం అతి సులభంగా పొందే అవకాశం అందిస్తుంది. సోనెట్‌ను అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్‌తో అంతటా తీర్చిదిద్దారు మరియు దీని డాష్‌బోర్డ్‌ ప్రత్యేకమైన వివరాలను ప్రదర్శిస్తుంది. స్టీరింగ్‌ వీల్‌, సీట్లు మరియు డోర్‌ ఆర్మ్‌రెస్ట్‌పై కాంట్రాస్ట్‌ రెడ్‌ స్టిచింగ్‌తో జీటీ–లైన్‌ మోడల్స్‌ ఫినీష్‌ చేశారు. అదే సమయంలో డీ–కట్‌ స్టీరింగ్‌ వీల్‌ దీని యొక్క స్పోర్టీ అప్పీల్‌కు జోడించబడింది. వెంటిలేటెడ్‌ డ్రైవర్‌ మరియు ముందు వరుస ప్రయాణీకుల సీట్లు ఈ విభాగంలో తొలిసారి. ఇది కియా యొక్క పవర్‌ టు సర్‌ప్రైజ్‌ సిద్ధాంతాన్ని పునరుద్ఘాటిస్తుంది.
 
డ్యాష్‌బోర్డ్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఈ విభాగంలో అతిపెద్ద 10.25 అంగుళాల (26.03 సెంటీమీటర్లు) హెచ్‌డీ టచ్‌స్ర్కీన్‌. వినోదంతో పాటుగా నేవిగేషన్‌ వ్యవస్థను సైతం ఇది కలిగి ఉంటుంది. కంపాక్ట్‌ ఎస్‌యువీ విభాగంలో కియా యొక్క ప్రీమియం స్థానాన్ని ఇది ప్రదర్శిస్తుంది. ఈ వ్యవస్థ కియా యొక్క సహజమైన మరియు స్నేహపూర్వక యువీఓ కనెక్టడ్‌ కార్‌ టెక్నాలజీని అందిస్తుంది. అదనంగా, 4.2 అంగుళాల (10.66 సెంటీమీటర్లు) ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, డ్రైవర్‌కు అతి ముఖ్యమైన సమాచారాన్ని వైవిధ్యమైన  రంగులు, స్పష్టతతో అందిస్తుంది. అంటే ప్రతి మలుపులోనూ నేవిగేషన్‌ సూచనలు, హైలైన్‌ టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (టీపీఎంఎస్‌) మరియుడ్రైవ్‌ మోడ్‌, ట్రాక్షన్‌మోడ్‌ ఎంపిక వంటివి ఉంటాయి.
 
కారు లోపల కూర్చున్న వారికి ఆహ్లాదకరమైన అనుభవాలను అందించే రీతిలో సోనెట్‌ లక్ష్యంగా చేసుకుంది. కాన్సర్ట్‌ తరహా వాతావరణం సృష్టించేందుకు , ఈ విభాగంలో  బోస్‌ నుంచి ఆడియో పనితీరు అందిస్తున్న ఒకే ఒక్క వాహనంగా సోనెట్‌ నిలిచింది. ప్రీమియం ఏడు స్పీకర్ల వ్యవస్థను సబ్‌ ఊఫర్‌తో సహా అందిస్తుంది. ఇతర భావోద్వేగ వృద్ధి కారకాలలో ఎల్‌ఈడీ సౌండ్‌ మూడ్‌ లైటెనింగ్‌ను ఈ విభాగంలో వినూత్నమైన వ్యక్తిగతీకరణ స్థాయిని పరిచయం చేసేందుకు అందించారు. అలాగే కూలింగ్‌ ఫంక్షన్‌తో వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ చార్జర్‌ను సోనెట్‌లో మాత్రమే ప్రత్యేకంగా చూడవచ్చు.
 
అదనంగా, డ్రైవర్‌తో పాటుగా వారు అభిమానించే వారికి మరింత భద్రతను అందిస్తూ, సోనెట్‌లో ఇప్పుడు వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తూ కియా యొక్క స్మార్ట్‌ ప్యూర్‌ ఎయిర్‌ ఫ్యూరిఫయర్‌ను జోడించారు. ఈ విభాగంలో కియాను ప్రత్యేకంగా ఈ ఫీచర్‌ నిలుపనుంది మరియు మరోమారు ఈ విభాగంలో నూతన బెంచ్‌మార్క్‌ను ఇది సృష్టించింది. సోనెట్‌లోని నూతన స్మార్ట్‌ప్యూర్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్‌లో రెండంచెల ప్యూరిఫికేషన్‌ వ్యవస్ధ ఉంది. కాలుష్యంను సైతం శుభ్రపరిచే హెపా ఫిల్టర్‌లో ఎన్‌ 29 ఉంది. ఇది కాపర్‌ సల్ఫైడ్‌ యొక్క నానో–ఐకానిక్‌ బాండింగ్‌ సాంకేతికతను వినియోగించడంతో పాటుగా కాలుష్య కారకాలను మరియు బ్యాక్టీరియాను క్యాబిన్‌ నుంచి తొలగిస్తుంది. యువీసీ ఎల్‌ఈడీ ద్వారా ద్వితీయ స్థాయి ఫిల్టరేషన్‌ చేరుకోవచ్చు, ఇది శాస్త్రీయంగా బ్యాక్టీరియా మరియు వైరస్‌లను చంపుతుందని నిరూపితమైంది. ఈ వ్యవస్థ కేవలం ప్రభావవంతంగా క్యాబిన్‌ నుంచి కాలుష్య కారకాలకు వెలుపలకు పంపడం మాత్రమే కాదు, బ్యాక్టీరియా మరియు వైరస్‌లను చంపి గాలిని సైతం శుభ్రపరుస్తుంది.
పవర్‌ ట్రైన్‌ మరియు పనితీరు
పవర్‌ టు సర్‌ప్రైజ్‌ అనే కియా యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా కియా సోనెట్‌ తమ శ్రేణిలో ఆశ్చర్యకరమైన స్ధాయిలో విస్తృతశ్రేణి పవర్‌ట్రైన్స్‌ ఎంపికలను అందిస్తుంది. మూడు ఇంజిన్లు  మరియు ఐదు ట్రాన్స్‌మిషన్‌ అవకాశాల నుంచి ఎంచుకునే అవకాశం అందిస్తుంది. ఈ విభాగంలో ప్రతి వినియోగదారుని అవసరానికీ తగినట్లుగా  ఇంజిన్‌–ట్రాన్స్‌మిషన్‌ సమ్మేళనం ఉంది. రెండు పెట్రోల్‌ ఇంజిన్స్‌ – వైవిధ్యమైన స్మార్ట్‌ స్ట్రీమ్‌ 1.2 లీటర్‌ నాలుగు సిలెండర్‌ మరియు శక్తివంతమైన 1.0 టీ–జీడీఐ మరియు సమర్థవంతమైన 1.5లీటర్‌ సీఆర్‌డీఐ డీజిల్‌ ఇంజిన్‌ ఉంటాయి.
 
సోనెట్‌ వాహనాలు ఐదు ట్రాన్స్‌మిషన్‌ అవకాశాలు ః ఐదు మరియు ఆరు స్పీడ్‌ మాన్యువల్స్‌ మరియు సహజమైన సెవన్‌ –స్పీడ్‌ డీసీటీ ; సిక్స్‌–స్పీడ్‌ ఆటోమేటిక్‌ మరియు కియా యొక్క విప్లవాత్మక నూతన సిక్స్‌–స్పీడ్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ ఇంటిలిజెంట్‌మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఉన్నాయి. అదనంగా, సోనెట్‌ యొక్కఆటోమేటిక్‌ వేరియంట్స్‌ మల్టీ డ్రైవ్‌ మరియు ట్రాక్షన్‌ మోడ్స్‌ను అదనపు సౌకర్యం, డ్రైవర్‌ విశ్వాసం, భద్రత కోసం అందిస్తున్నారు.
 
సోనెట్‌ యొక్క 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌ను అందిస్తుంది మరియు ఈ విభాగంలో వినూత్నంగా సిక్స్‌–స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సైతం ఉంది. ఇది ఈ విభాగంలో ఇప్పటి వరకూ తీరని అవసరాలను సైతం తీరుస్తుంది.  ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌యొక్క సౌకర్యం మరియు సౌలభ్యంతో డీజిల్‌ ఇంజిన్‌ యొక్క లాంగ్‌–లెగ్డ్‌ క్రూయిజింగ్‌ సామర్థ్యంను వినియోగదారులు ఆస్వాదించవచ్చు.
 
స్మార్ట్‌స్ట్రీమ్‌ సిక్స్‌ స్పీడ్‌ ఐఎంటీ
విప్లవాత్మక గేర్‌బాక్స్‌ను సోనెట్‌ కలిగి ఉంది. ఇది నియంత్రణ మరియు సౌకర్యం నడుమ సమతుల్యతను అందిస్తుంది. సిక్స్‌–స్పీడ్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ ఇంటిలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌, భారతదేశంలో సవారీ అనుభవాలను పునర్నిర్వచించనున్నాయి. భావుకత పరంగా చూసినప్పుడు ఐఎంటీ వినూత్నమైనది. ఎందుకంటే, దీనిలో ఎలాంటి క్లచ్‌ పెడల్‌ లేదు. కానీ, గేర్‌ లీవర్‌ సైతం ఉంటాయి. డ్రైవర్‌ లీవర్‌ను వినియోగించి గేర్లు మార్చాలనుకున్నప్పుడు ఈ క్లచ్‌ ఎలక్ర్టానిక్‌ పరంగా ప్రేరేపించబడుతుంది. గేరు మార్చడం పూర్తి కాగానే అది యథాస్థాయికి వస్తుంది. గేర్‌ లీవర్‌ యొక్క కదలికలను సెన్సార్‌ కనుగొనడంతో పాటుగా క్లచ్‌ చర్యలను మృదువుగా జరిగేలా చేస్తుంది. గేర్లు మార్చాలనుకున్నప్పుడు, ఈ క్లచ్‌ తిరిగి పనిచేయడంతో పాటుగా గేరు మార్పును పూర్తి చేస్తుంది.
 
ఈ ఇంటెన్షన్‌ సెన్సార్‌ను కేవలం చిన్న కదలికలలో పనిచేయకుండా ఉండేలా ప్రోగ్రామ్‌చేశారు. ఉదాహరణకు, డ్రైవర్‌ షిప్ట్‌ లీవర్‌ను కొట్టినప్పుడు అది పనిచేయదు. దానికి బదులుగా, ప్రోగ్రామ్‌ చేయబడిన పరిమితి కంటే గేర్‌లీవర్‌ మరింత మారినప్పుడు మాత్రమే ఇది సిగ్నల్‌ను పంపుతుంది. ముఖ్యంగా, క్లచ్‌ పెడల్‌తో సంబంధం లేకుండా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కారులా దీనిని ఒకరు అత్యంత సులభంగా నడుపవచ్చు. ఈ వ్యవస్థను భారతీయ రోడ్లపై విస్తృతంగా పరీక్షించారు. విభిన్నమైన భారతీయ డ్రైవింగ్‌ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఇది క్లిష్టతలేని, మృదువైన మరియు ఆహ్లాదకరమైన డ్రైవింగ్‌ అనుభవాలను అందిస్తుంది.
 
స్మార్ట్‌స్ట్రీమ్‌ సిక్స్‌–స్పీడ్‌ ఐఎంటీ యొక్క ప్రధాన ఆకర్షణలు
అతి తక్కువగా డ్రైవర్‌కు అలసట: క్లచ్‌ పెడల్‌ను వినియోగించాల్సిన అవసరం లేదు, మరీముఖ్యంగా ఆగి–వెళ్లే ట్రాఫిక్‌ సమయాల్లో !
సుదీర్ఘమైన క్లచ్‌ లైఫ్‌: ఎలక్ట్రానిక్‌ పరంగా ప్రేరేపించబడింది, క్లచ్‌తో సవారీ చేయాల్సిన అవసరం లేదు.
మృదువైన సవారీ: క్లిష్టతలేకుండా క్లచ్‌ విడుదలవుతుంది ; మృదువైన మాన్యువల్‌ గేర్‌ మార్పును అందిస్తుంది.
అంతేనా, ఐఎంటీను అతి జాగ్రత్తగా అన్ని డ్రైవింగ్‌ పరిస్థితులకూ తగినట్లుగా తీర్చిదిద్దారు.  ఉదాహరణకు, హిల్‌స్టార్ట్‌ సమయంలో, ఆర్‌పీఎం కంట్రోల్‌ మాడ్యుల్‌ , వాహనం వెనుక్కి రాకుండా నిరోధిస్తుంది. ఈ సృజనాత్మక గేర్‌బాక్స్‌ అతి తక్కువ వేగం వద్ద అత్యున్నత గేర్‌లో ఉన్నప్పుడు నిలిచిపోకుండా ప్రోగ్రామ్‌ చేయబడింది. ఈ వ్యవస్థ   స్పష్టమైనది మరియు అన్ని స్థాయిల అనుభవం కలిగిన డ్రైవర్లకు ఇది సుపరిచితం.
 
సవారీ మరియు నియంత్రణ
కియా బ్రాండ్‌ యొక్క స్పోర్టీ, బోల్డ్‌ మరియు యువ బ్రాండ్‌ వ్యక్తిత్వంను నిలుపుతూ, సోనెట్‌ యొక్క డ్రైవింగ్‌ లక్షణాలను  డ్రైవింగ్‌ ప్రియులకు వీల్‌ వెనుక ఆహ్లాదకరమైన అనుభవాలను  అందించేలా తీర్చిదిద్దారు. సస్పెన్షన్‌ సెటప్‌తో పాటుగా ఎలక్ట్రికల్‌గా సహాయపడే పవర్‌ స్టీరింగ్‌ నుంచి అందుకున్న ఫీడ్‌బ్యాక్‌ , స్పోర్టీ డ్రైవింగ్‌ అనుభవాన్ని అందించడానికి మెరుగుపరచబడింది. ఇది డ్రైవర్‌కు అపారమైన ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది.
 
ఈ సవారీ మరియు నియంత్రణను కియా ఇంజినీర్లు అత్యుత్తమంగా కొరియాలోని బ్రాండ్‌ యొక్క నమ్యాంగ్‌ ఆర్‌ అండ్‌ డీ హెడ్‌ క్వార్టర్స్‌వద్ద మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లోని బ్రాండ్‌ యొక్క డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వద్ద ఫైన్‌ ట్యూన్‌ చేశారు. సోనెట్‌ ప్రోటోటైప్స్‌ను భారతీయ రోడ్లపై ఒక లక్ష కిలోమీటర్లకు పైగా నడిపి పరీక్షించారు. విభిన్న పరిస్థితులలో వీటిని నడుపడం వల్ల, అత్యున్నత సవారీ నాణ్యతను అత్యుత్తమ సౌకర్యంతో, దీని యొక్క స్పోర్టీ స్ఫూర్తిపరంగా ఎలాంటి రాజీలేకుండా అందిస్తుంది.
 
యువీఓ కనెక్ట్‌
భారతదేశంలో 50000 యాక్టివ్‌ కనెక్టడ్‌ కార్లను రోడ్లపై  కలిగిన మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ఆటోమోటివ్‌ బ్రాండ్‌గా కియా నిలిచింది. భారతీయ వినియోగదారులకు అత్యాధునిక కారు సాంకేతికతలను అందించాలనే కియా మోటార్స్‌ ఇండియా యొక్క ప్రయత్నం కారణంగా కియా యొక్క యువీఓ కనెక్టడ్‌ కార్‌ టెక్నాలజీ అందించే ఈ సహజమైన, స్నేహపూర్వక వినియోగదారుల ఇంటర్‌ఫేజ్‌ సాధ్యమైంది.
 
ఈ వాగ్థానం నిలుపుకుంటూ, సోనెట్‌ సైతం కియా యొక్క సిగ్నేచర్‌ యువీఓ కనెక్ట్‌ సూట్‌ సాంకేతికతలను అందిస్తుంది. దాదాపు 57 కు ఫీచర్లు వాహన యజమానులకు సౌకర్యం అందించడంతో పాటుగా రిమోట్‌గా నియంత్రణ, నేవిగేషన్‌, భద్రత, రక్షణ మరియు వాహన నిర్వహణను సైతం అందిస్తాయి. దీనిలో కియా యొక్క యువీఓ వాయిస్‌ అసిస్ట్‌ ఫీచర్‌ సైతం ఉంది. ఇది ‘హెలో , కియా’ అని పలుకగానే స్పందిస్తుంది. ఈ కృత్రిమ మేథస్సు శక్తివంతమైన వాయిస్‌ రికగ్నైజేషన్‌ సాంకేతికత మెరుగైన, కనెక్టడ్‌ అనుభవాలను అందించడంతో పాటుగా బహుళ ఫీచర్లను సైతం నియంత్రించే అవకాశం కల్పిస్తుంది. వీటిలో ఫోన్‌ కాల్స్‌, వాతావరణ సమాచారం, కాలం మరియు తేదీ, భారతీయ హాలీడే సమాచారం, మీడియా నియంత్రణ, నేవిగేషన్‌ నియంత్రణ, వాతావరణ నియంత్రణ మరియు ఆఖరకు తాజా క్రికెట్‌ స్కోర్లు మరియు పరిశ్రమలో మొట్టమొదటిసారిగా డ్రైవర్‌ పక్కన కిటికీని పైకి లేదా కిందకు దించడం వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే ఫీచర్‌ను సైతం కలిగి ఉంది.
 
అత్యున్నత సౌకర్యం కలిగిన రిమోట్‌ స్టార్ట్‌/స్టాప్‌ ఫీచర్‌, గతంలో కొంతమంది కొనుగోలుదారులకు ఆటోమేటిక్‌ కియా వాహనాలలో మాత్రమే లభ్యమయ్యేది. ఇప్పుడు ఇది మాన్యువల్‌ మరియు ఇంటిలిజెంట్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్స్‌ మోడల్స్‌లో సైతం లభ్యమవుతుంది.
 
సోనెట్‌ ఇప్పుడు యువీఓ స్మార్ట్‌ వాచ్‌ యాప్‌ కనెక్టివిటీ అవకాశంగా కూడా లభ్యమవుతుంది. తద్వారా వినియోగదారులు తమ వాహనాన్ని ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ లేదా టిజెన్‌ స్మార్ట్‌వాచ్‌ ద్వారా కనెక్ట్‌ కాగలరు. అదనంగా, యువీఓ లైట్‌ ఫీచర్‌ స్మార్ట్‌ ఎయిర్‌ ప్యూరిఫయర్‌ను మరియు ఇన్ఫోటైన్‌మెంట్‌ వ్యవస్థను సైతం నియంత్రిస్తుంది. తద్వారా సోనెట్‌ యొక్క ఫీచర్లను మరింత సౌకర్యవంతంగా వినియోగించుకునే అవకాశం కల్పిస్తుంది. అదనంగా, ఈ కారు ఆటో యాంటీ –గ్లేర్‌ (ఈసీఎం) రియర్‌ వ్యూ మిర్రర్‌ను యువీఓ కంట్రోల్స్‌తో అందిస్తుంది. ఇది వెనుకవైపు విజిబిలిటీని సురక్షితంగా మరియు మరింత విశ్వాసం– స్ఫూర్తిదాయక సవారీతో అందిస్తుంది.
 
భద్రత
వినియోగదారుల భద్రత అనేది అంతర్జాతీయంగా కియాకు అత్యంత ప్రాధాన్యతాంశం. సోనెట్‌ యొక్క బాడీలో రెండు వంతులకు పైగా అత్యున్నత ధృడత్వం మరియు అత్యాధునిక హై స్ట్రెంగ్త్‌ స్టీల్‌తో తయారైంది. తేలికగా ఉన్నప్పటికీ ధృడమైన నిర్మాణం ఇది అందిస్తుంది. అంతేకాదు, సోనెట్‌లో ప్రతి సవారీ ఆహ్లాదకరం మరియు వీలైనంత సురక్షితమన్న భరోసాను అందిస్తుంది. ఇందుకు విస్తృతశ్రేణి భద్రతా ఫీచర్లు కారణం. దీనిని భద్రత పరంగా కియా యొక్క ఐదు మూల స్థంభాలు ః క్రియాశీల, నిష్ర్కియాత్మక, ఆరోగ్యం, భద్రత మరియు నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దారు. 
 
సోనెట్‌ యొక్క కీలకమైన ఇతర భద్రతా ఫీచర్లలో:
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు
ఈబీడీ(ఎలకా్ట్రనిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌)తో ఏబీఎస్‌ (యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ)
ఈఎస్‌సీ (ఎలకా్ట్రనిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌), హెచ్‌ఏసీ(హిల్‌స్టార్ట్‌ అసిస్ట్‌ కంట్రోల్‌), వీఎస్‌ఎం(వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌) మరియు బీఏ(బ్రేక్‌ అసిస్ట్‌)
ముందు మరియు వెనుక పార్కింగ్‌ సెన్సార్లు
ప్రొజెక్టర్‌ ఫాగ్‌ల్యాంప్స్‌
హైలైన్‌ టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ వ్యవస్థ (టీపీఎంఎస్‌)
ఆటో హెడ్‌ల్యాంప్స్‌
ఐసోఫిక్స్‌ చైల్డ్‌ సీట్‌ యాంకరింగ్‌ పాయింట్స్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments