Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కస్టమర్ల కోసం జియో ఫైబర్...

Webdunia
బుధవారం, 3 మే 2023 (22:11 IST)
దేశంలో హైస్పీడ్ ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఓటీటీలకు సైతం విస్తృత ఆదరణ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా జియో ఫైబర్ ఎప్పటికప్పుడు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రూ.899 (జీఎస్ఓటీ అదనం)తో ప్రత్యేక ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. దీంట్లో ప్రయోజనాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
 
నెలకు రూ.899 (జీఎస్టీ అదనం)తో వస్తున్న ఈ ప్లాన్‌లో మొత్తం 14కు పైగా ఓటీటీ (OTT) యాప్లకు యాక్సెస్ ఉంటుంది. మూడు, ఆరు, 12 నెలల కాలవ్యవధితో కూడా ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. నెలకు 3.3 టీబీ వరకు 'ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)' పరిమితి ఉంటుంది. అంటే దాదాపు ఎలాంటి అంతరాయం లేకుండా నెలంతా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
 
ఈ 100 ఎంబీపీఎస్ ప్లాన్‌తో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు 550కి పైగా టీవీ ఛానెళ్లను సైతం వీక్షించొచ్చు. లైవ్లో టీవీ షోలు, స్పోర్ట్స్ చూసేవారికి ఇది మంచి ఆప్షన్. ఈ ప్లాన్ తీసుకున్నవారికి జియో సెటాప్ బాక్స్‌ను ఉచితంగానే అందిస్తారు. ఓటీటీల విషయానికి వస్తే డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, డిస్కవరీ ప్లస్, ఈరోస్ నౌ, జియో సినిమా సహా మొత్తం 14కి పైగా యాప్లకు యాక్సెస్ ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments