Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

“నమ్మకం అంశాన్ని” కస్టమర్‌లు ఎలా పొందుతారో వివరించిన ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్

Cash
, శనివారం, 29 ఏప్రియల్ 2023 (22:13 IST)
నమ్మకానికి విభిన్న సూచనలు ఉంటాయి, కానీ జీవిత బీమా వ్యాపారంలో నమ్మకం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్ నమ్మకాన్ని కొనసాగించడంలోను, అలాగే తమ కస్టమర్ ప్రాధాన్యతలను, విధేయతను నిర్ణయించడంలో ముందంజలో ఉంది. జీవిత బీమా బ్రాండ్‌ను ఎంచుకునే విషయంలో నమ్మకమే మూలస్తంభమని వారు గ్రహించారు.
 
విశ్వసనీయతను నెలకొల్పడంలో నమ్మకం పెంపొందించడం ముఖ్యం. ఎందుకంటే, జీవిత బీమాను కొనుగోలు చేసేటప్పుడు లేదా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్‌లు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ ఆందోళనలకు స్పందించడం కోసం, ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్ “'ట్రస్ట్ టాక్స్' - భరోసే కీ బాత్” అనే ప్రచారాన్ని ప్రారంభించింది, దీని ద్వారా కస్టమర్‌లు తమ నిజ జీవిత అనుభవాలను పంచుకుంటారు. ఇందులో ఉత్పత్తులను సూచించే సమయం నుండి, పాలసీని కొనుగోలు చేయడం, అమ్మకం తర్వాత సేవలు ఉండగా, క్లెయిమ్ పరిష్కారం అనేది నిజమైన పరీక్షా సమయంగా చెప్పాలి. ఇది తన వినియోగదారులకు 'విశ్వసనీయ జీవితకాల భాగస్వామి'గా బ్రాండ్‌ ప్రధాన విలువకు నిజమైన నిదర్శనం.
 
ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తమ కస్టమర్‌లకు చెందిన కొన్ని నిజ జీవిత కథలను, అనుభవాల ఆధారంగా నిర్మించబడుతోంది. ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్‌కు విశ్వసనీయ కస్టమర్ అయిన శ్రీ రజనీష్ అగర్వాల్ మాట్లాడుతూ, “సేల్స్ టీమ్‌తో నాకు చాలా మంచి అనుభవం నెలకొంది. వారి కారణంగానే నేను నా కోసం పాలసీని కొనుగోలు చేయడంలో ముందడుగు వేశాను. పాలసీ దశలు, ప్రామాణికతను బాగా వాళ్లు ఎంతో చక్కగా వివరించారు, ఇది అమ్మకందారుడిపైనే కాకుండా కంపెనీపై కూడా నాకు నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడింది. కంపెనీ ప్రతి ఒక్కరికీ ఆయా వ్యక్తుల పొదుపు లక్ష్యాల ప్రకారం ఉత్పత్తులను అందిస్తుంది,” అన్నారు.
 
ఫ్యూచర్ జెనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్‌ సంతృప్తి చెందిన కస్టమర్లలో ఒకరైన మరొక ఆనందమయ కస్టమర్ శ్రీ శరద్ కుమార్ శర్మ మాట్లాడుతూ, “సేల్స్ టీమ్ నిరంతరం నాకు ఎంతో సహకారం అందిస్తుంది. వారితో నా అనుభవం చాలా ఆహ్లాదకరంగా ఉంది. గడువు తేదీ, పాలసీ రసీదు మొదలైన వాటి గురించి నేను ఎస్‌ఎంఎస్‌ ద్వారా సకాలంలో అప్‌డేట్‌లను పొందుతున్నాను. నేను వారి పాలసీలను నా స్నేహితులు, కుటుంబ సభ్యులకు సిఫార్సు చేస్తాను. సాధ్యమైతే, అలాగే అవసరమైతే భవిష్యత్తులో నా మనవళ్ల కోసం ఈ పాలసీని తీసుకుంటాను.” అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రజనీకాంత్‌పై లక్ష్మీపార్వతీ ఫైర్.. చంద్రబాబు మైకు వైరులు కట్ చేసి..?