Webdunia - Bharat's app for daily news and videos

Install App

04-01-2017 నుంచి 31-12-2017 వరకూ ఫ్రీ ఎయిర్ టెల్ డేటా... జియోకు ధీటైన ప్యాకేనా...?

ఉచితమంటేనే అగ్నిగుండంలా మండిపోయిన ఎయిర్ టెల్ రిలయన్స్ జియో దెబ్బకు తను కూడా దిగిరాక తప్పలేదు. ఉచిత ఆఫర్లతో జియో ముందుకు దూసుకెళ్లడాన్ని తట్టుకోలేని ఎయిర్ టెల్ తనూ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించి జియోకు గట్టి ష

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (21:53 IST)
ఉచితమంటేనే అగ్నిగుండంలా మండిపోయిన ఎయిర్ టెల్ రిలయన్స్ జియో దెబ్బకు తను కూడా దిగిరాక తప్పలేదు. ఉచిత ఆఫర్లతో జియో ముందుకు దూసుకెళ్లడాన్ని తట్టుకోలేని ఎయిర్ టెల్ తనూ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించి జియోకు గట్టి షాక్ ఇచ్చింది. ఇతర నెట్వర్కుల నుంచి తమ 4జి నెట్వర్కులోకి వచ్చే వినియోగదారులందరికీ రూ.9 వేల విలువైన డేటాను.. 2017 జనవరి 4 నుంచి డిసెంబరు చివరి వరకూ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
4జీ మొబైల్ హ్యాండ్సెట్ వున్నవారికి ఈ ఆఫర్ ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. జ‌న‌వ‌రి 4 నుంచి ఫిబ్ర‌వ‌రి 28 వ‌ర‌కు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అలాగే ఉచిత ఆఫర్ కోసం ఎయిర్ టెల్ నెట్వర్కులోకి కొత్తగా చేరేవారికి నెల‌కు 3 జీబీ చొప్పున డిసెంబ‌ర్ 31, 2017 వ‌ర‌కు ఉచిత డేటా అందించనున్నట్లు తెలియజేసింది. 
 
ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్‌ల‌తోపాటు సాధారణంగా వ‌చ్చే ప్యాకేజీల‌కు ఇది అద‌నమనీ, ప్రీపెయిడ్‌లో రూ.345 రీచార్జ్ చేసుకొనేవారికి వచ్చే 1 జీబీ డేటాకు అద‌నంగా నెల‌కు మ‌రో 3 జీబీ డేటా అందుతుందని తెలిపింది. ఈ ఫ్రీ డేటా ప్ర‌తి నెలా 28 రోజుల పాటు ఉంటుందని సంస్థ తెలియజేసింది. కాగా 2017 మార్చి తర్వాత కూడా జియో తన ఉచిత ఆఫర్లను తమ కస్టమర్లకు అందించేందుకు సమాయత్తమవుతుందని సమాచారం. ఈ నేపధ్యంలో పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ ఈ ఆఫర్ ప్రకటించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర విడుదలకు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments