Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుపోటుకు రెడీ- అఖిలేష్... వద్దు కన్నా- ములాయం... మధ్య బ్రోకర్... ఏం జరిగిందంటే?

రాజకీయాల్లో పక్కనే ఉంటూనే వెన్నుపోటు పొడిచి అవతల పార్టీకి వెళ్లిపోవడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇక అధికారం కోసం రాజుల కాలంలో తండ్రిని, సోదరులను బంధించడం, హత్యలు చేయడం చాలానే చూశాం. ఇంతకీ విషయం ఏంటయా అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (17:43 IST)
రాజకీయాల్లో పక్కనే ఉంటూనే వెన్నుపోటు పొడిచి అవతల పార్టీకి వెళ్లిపోవడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఇక అధికారం కోసం రాజుల కాలంలో తండ్రిని, సోదరులను బంధించడం, హత్యలు చేయడం చాలానే చూశాం. ఇంతకీ విషయం ఏంటయా అంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీలో రోజుకో మలుపు తిరుగుతోంది రాజకీయం. నాన్న ములాయం కొడుకుని పార్టీ నుంచి బహిష్కరిస్తారు వెంటనే ఉపసంహరించుకుంటారు. కొడుకేమో తండ్రి పార్టీని కబ్జా చేస్తారు మళ్లీ ఇంటికెళ్లి మాట్లాడుతారు. 
 
నిన్నటివరకూ సైకిల్ గుర్తు నాదేనని చెప్పిన అఖిలేష్ తెల్లారేసరికి తండ్రి ఇంటికెళ్లి మీటింగ్ పెట్టేశాడు. అక్కడ ఏం జరిగిందని చూస్తే.... తండ్రీకొడుకుల మధ్య సయోధ్య కుదర్చడానికి మధ్యవర్తి.. అదేనండీ బ్రోకర్ అవతారమెత్తారు అజమ్ ఖాన్. ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలంటూ ఒక్కచోట కూర్చోబెట్టారు.
 
ఢిల్లీలో ఈ సమావేశం ముగియగానే ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ మంత్రి ఏర్పాటు చేసిన విమానంలో బయలుదేరి లక్నో వెళ్లిపోయారు. ఆ తర్వాత అఖిలేష్ మాట్లాడుతూ... నేతాజీ(నాన్న)తో చర్చించాను. ఆయనే పార్టీ అధ్యక్షుడు. కానీ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపిక మొత్తం నేను చూసుకుంటానంటే ఆయన ఒప్పుకున్నారు. ఆయనను జాతీయ రాజకీయాలకు పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ ప్రకటించారు. మరి, ఈ ప్రకటన తర్వాత ఇంకా ఏమైనా ట్విస్టులు వస్తాయోమో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరిత్ర సృష్టించి 13 వారాల పాటు ట్రెండ్ అయిన లక్కీ భాస్కర్ చిత్రం

కోలీవుడ్‌లో వరుస ఛాన్సులు దక్కించుకుంటున్న పూజా హెగ్డే

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర విడుదలకు సిద్దమైంది

Pooja Hegde: రజనీకాంత్ కూలిలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు భారి డిమాండ్ !

dubai: టాలీవుడ్ ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్ళేది అందుకేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments