క్రౌడ్‌సోర్స్‌ చేసేందుకు ఇన్వెస్ట్‌ ఇండియాతో భాగస్వామ్యం చేసుకున్న ఐటీసీ

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (21:18 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ పేపర్‌, పేపర్‌బోర్డ్స్‌ మరియు స్పెషాలిటీ పేపర్‌ తయారీ సంస్థ ఐటీసీ పేపర్‌ బోర్డ్స్‌ అండ్‌ స్పెషాలిటీ పేపర్స్‌ డివిజన్‌ (పీఎస్‌పీడీ) ఇప్పుడు ఇన్వెస్ట్‌ ఇండియాతో భాగస్వామ్యం చేసుకుని ఐటీసీ సస్టెయినబిలిటీ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించింది.


సస్టెయినబల్‌ ప్యాకేజింగ్‌, స్మార్ట్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పరిష్కారాలపై వినూత్నమైన స్టార్టప్‌ ఆలోచనలకు ఇది మద్దతునందిస్తుంది. ఈ పరస్పర ప్రయోజన భాగస్వామ్యం భారతదేశపు మహోన్నతమైన స్టార్టప్‌ వ్యవస్థపై ఆధారపడి ఐటీసీ-పీఎస్‌పీడీని ప్రభావితం చేయగలదు. అదే సమయంలో దేశపు స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థకు సైతం మద్దతునందించనుంది.

 
స్టార్టప్‌ ఇండియా పోర్టల్‌ ద్వారా ఐటీసీ పీఎస్‌పీడీ ఇప్పుడు స్టార్టప్స్‌ నుంచి ఈ ఛాలెంజ్‌ల కోసం ప్రతిస్పందనలను ఆహ్వానిస్తోంది. దీనిద్వారా ఒకసారి వినియోగించి పారవేసే ప్లాస్టిక్స్‌కు ప్రత్యామ్నాయాలతో పాటుగా స్వయంచాలకంగా వ్యర్థాలను వేరుచేసే ప్రక్రియలను స్మార్ట్‌ టెక్నాలజీ ఆధారిత పరిష్కారాల ద్వారా  రూపొందించడం ద్వారా సామర్థ్యం మరియు వేగం మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుంది.

 
ఐటీసీ సస్టెయినబిలిటీ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ కోసం ఎంపికైన స్టార్టప్స్‌కు ఈ కార్యక్రమంలో పలు దశల వద్ద ప్రోత్సాహకాలను  అందించనున్నారు. దీనిలో భాగంగా నిపుణుల నుంచి మెంటార్‌షిప్‌, పెయిడ్‌ పైలెట్‌ అవకాశం, డెవలప్‌మెంట్‌ దశలో టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ కోసం సహాయపడటం జరుగుతుంది. దీనిని అనుసరించి ‘ఎర్లీ మార్కెట్‌ ప్లే స్టేజ్‌’లో ఫండింగ్‌ అవకాశాల ద్వారా మార్కెట్‌ విస్తరణ, సామర్థ్య నిర్వహణకు సైతం మద్దతునందిస్తుంది. తమ ఆలోచలను పంపేందుకు ఆఖరు తేదీ 28 ఫిబ్రవరి 2022.

 
ఐటీసీ పీఎస్‌పీడీ సీఈవొ వాదిరాజ్‌ కులకర్ణి మాట్లాడుతూ, ‘‘పెద్దదైనా, చిన్నదైనా వ్యాపార సంస్థలు తమ అసాధారణ నిర్వహణ, వినూత్నమైన సామర్థ్యం, నిలకడైన ప్యాకేజింగ్‌, వ్యర్థ నిర్వహణ పరిష్కారాలతో సమాజంలో మార్పును తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ఫిలాసఫీ నూతన ఐటీసీ సస్టెయినబిలిటీ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో ప్రదర్శితమవుతుంది’’ అని అన్నారు.

 
ఇన్వెస్ట్‌ ఇండియా ఎండీ అండ్‌ సీఈవో దీపక్‌ బగ్లా మాట్లాడుతూ, ‘‘సర్కులర్‌ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశం పయణించే రీతిలో మేడ్‌ ఇన్‌ ఇండియా పరిష్కారాలను ఇన్నోవేటివ్‌ స్టార్టప్స్‌ ప్రదర్శించగలవు. భారతదేశపు వృద్ధి కథలో భాగం కావాల్సిందిగా స్టార్టప్స్‌ను ఆహ్వానిస్తున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments