Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్పైడర్‌ కెమెరా ఆగిపోయింది.. ఆటాడుకున్న టీమిండియా క్రికెటర్లు (video)

Advertiesment
India vs New Zealand 2nd Test
, సోమవారం, 6 డిశెంబరు 2021 (13:06 IST)
R Ashwin
భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మ్యాచ్‌ని కవర్‌ చేసే స్పైడర్‌ కెమెరా పిచ్‌‌‍కి తక్కువ ఎత్తులో వచ్చి ఎటూకాకుండా ఆగిపోయింది. దీన్ని పైకి లాగేందుకు గ్రౌండ్ సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేసినా కుదరలేదు. దీంతో ఏం చేయాలో తోచలేని అంపైర్లు నిర్ణీత సమయానికంటే ముందే టీ విరామం ప్రకటించారు. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్‌ చివరి బంతికి కివీస్‌ బ్యాటర్‌ టామ్‌ లాథమ్‌ ఎల్బీగా వెనుదిరిగిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకుంది.
 
స్పైడర్‌ కెమెరా ఎటూ కాకుండా ఆగిపోవడంతో మైదానంలోని టీమిండియా క్రికెటర్లు సరదాగా ఆటాడుకున్నారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌లు కెమెరా ముందు నిలబడి ' ఏయ్‌..ఇక్కడి నుంచి వెళ్లిపో' అన్నట్లు సంజ్ఞలిచ్చారు. ఇక స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కూడా బాహుబలి రేంజ్‌లో కెమెరాని భుజాలమీదకు ఎత్తుతున్నట్లు పోజులిచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు మిగతా క్రికెటర్లు కూడా కెమెరాతో ఆడుకున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు కూడా మీమ్స్‌తో చెలరేగారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ చిత్తు - భారత్ ఘన విజయం