Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో రూ.2 వేల నోట్లపై నిషేధం.. మళ్లీ రూ.1000 నోటు

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (13:33 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన రూ.2 వేల నోటును త్వరలో నిషేధించనున్నారనే వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో నిషేధించిన రూ.వెయ్యి నోటును తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఇపుడు ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో ప్రకారం, కేంద్రం డిసెంబరు నెలాఖరునాటికి రూ. 2వేల నోట్లను రద్దు చేస్తోంది. అందుకు ప్రజలకు కేవలం 10 రోజులే గడువు ఇవ్వనుంది. అంటే కేవలం పదిరోజుల్లో ప్రజలంతా తమ దగ్గరున్న సరదు రద్దు నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలి. 
 
బ్యాంకులు కూడా రూ 50 వేల విలువైన నోట్లను మాత్రమే తీసుకుంటాయి. అంటే ఒక్కొక్కరు కేవలం 25 రెండువేల రూపాయల నోట్లను మాత్రమే జమచేయగలుగుతారు అని ఆ వీడియో సందేశంలో ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి ఏటీఎం యంత్రాల్లో కొత్త నోట్లను లోడ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీ ఆ వీడియో సారాంశం. 
 
గత ఏడాది కాలంగా ఇది సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. లక్షల మంది దీన్ని షేర్‌ చేశారు. ఈ వార్తపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ప్రస్తుతం రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. అలాగే, రూ.1000 నోటును కూడా తిరిగి ప్రవేశపెట్టే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments