Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 18999కి గెలాక్సీ ఏ16 5జి విడుదల

ఐవీఆర్
శనివారం, 19 అక్టోబరు 2024 (22:21 IST)
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఈరోజు భారతదేశంలో గెలాక్సీ ఏ16 5జిని విడుదల చేసినట్లు వెల్లడించింది, దీని ప్రారంభ ధర రూ.18999. సరసమైన ధరలో వినియోగదారులకు అద్భుతమైన ఆవిష్కరణలను అందజేస్తూ, 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల భద్రతా నవీకరణలను అందించడం ద్వారా మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల కోసం భారతదేశంలో కొత్త ప్రమాణాన్ని గెలాక్సీ ఏ16 5జి నిర్దేశించనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 8 జిబి /128 జిబి మరియు 8 జిబి /256 జిబి. ఇవి గోల్డ్, లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్ వంటి అధునాతన రంగులలో, ఈ రోజు నుండి రిటైల్ స్టోర్‌లు, శాంసంగ్, అమెజాన్, ఫ్లిఫ్ కార్టులతో సహా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది.
 
అద్భుతమైన డిజైన్ మరియు పనితీరు
సొగసైన ఆచరణాత్మకమైన స్మార్ట్ ఫోన్‌గా సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి రూపొందించబడింది. ఈ పరికరం కేవలం 7.9 మిమీ వెడల్పుతో ఉంటుంది, ఇది ఇప్పటివరకు వున్న అతి సన్నటి మిడ్-రేంజ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్. ఐకానిక్ 'కీ ఐలాండ్' సౌందర్యం, మెరుగైన గ్లాస్టిక్ బ్యాక్, సన్నని బెజెల్స్‌తో జత చేయబడింది, ఇది చూడటానికి అద్భుతమైనదిగా ఉంటుంది. దాని అద్భుతమైన డిజైన్‌కు మించి, గెలాక్సీ ఏ16 5జి పెద్దదైన 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ప్రయాణంలో ఉన్న వినియోగదారులకు దీర్ఘకాలిక శక్తిని అందిస్తుంది. అప్‌గ్రేడ్ చేయబడిన మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌‌ను ఇది కలిగి వుంది, ఇది హైపర్-ఫాస్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది, మీరు గేమింగ్ చేసినా, స్ట్రీమింగ్ చేసినా లేదా అప్లికేషన్‌ల మధ్య మారుతున్నా మృదువైన, లాగ్-ఫ్రీ అనుభవాన్ని ఇది అందిస్తుంది.
 
అద్భుతమైన కెమెరా, డిస్ ప్లే 
ఈ ఉపకరణం శక్తివంతమైన, వైవిధ్యమైన ట్రిపుల్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది, ఇందులో 50 ఎంపి వైడ్, 5 ఎంపి అల్ట్రా-వైడ్, 2 ఎంపి మాక్రో లెన్స్ ఉన్నాయి. అల్ట్రా-వైడ్ లెన్స్ ప్రత్యేకంగా ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, విశాలమైన షాట్‌లను ఒడిసిపట్టటానికి రూపొందించబడింది. వినియోగదారులు ప్రతి ఫ్రేమ్‌లో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింతగా ఒడిసిపట్టటం ద్వారా తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. దీనికి అనుబంధంగా శక్తివంతమైన సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, పెద్ద 6.7” పూర్తి హెచ్ డి+స్క్రీన్‌తో అసలైన రంగులు, వేగవంతమైన కదలిక ప్రతిస్పందన, 1 మిలియన్:1 కాంట్రాస్ట్ రేషియో; లీనమయ్యే కంటెంట్ వీక్షణ, స్ట్రీమింగ్ కోసం దీన్ని ఆదర్శంగా మారుస్తుంది.
 
నమ్మకం- విశ్వసనీయత
విశ్వసనీయతను సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి పునర్నిర్వచిస్తోంది, ఆకట్టుకునే 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది, ఇది మిడ్-రేంజ్ మార్కెట్‌లో ప్రత్యేకించి, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను ప్రజాస్వామీకరించాలనే మా నిబద్ధత ప్రదర్శిస్తుంది. ఈ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న అప్‌గ్రేడ్‌లు పరికరాన్ని ఎల్లప్పుడూ తాజాగా ఉంచడానికి, వినియోగదారులకు సుదీర్ఘ కాలం పాటు సున్నితమైన వినియోగ అనుభవాలను అందించడానికి సెట్ చేయబడ్డాయి. దాని ఓర్పును హైలైట్ చేస్తూ, పరికరం నీరు, ధూళి నిరోధకత కోసం ఐపి 54 రేటింగ్‌ను కలిగి ఉంది, ఇది రోజువారీ సవాళ్లను తట్టుకునేలా చేస్తుంది. ఈ మన్నికను సంపూరం చేస్తూవు సామ్‌సంగ్ యొక్క నాక్స్ వాల్ట్ చిప్‌సెట్, సాఫ్ట్‌వేర్- హార్డ్‌వేర్ ముప్పుల నుండి రక్షణ కోసం ప్రత్యేక ట్యాంపర్-రెసిస్టెంట్ స్టోరేజ్‌లో PINలు, పాస్‌వర్డ్‌లు- నమూనాల వంటి సున్నితమైన డేటాను భద్రపరచడానికి రూపొందించబడింది, వినియోగదారులకు మనశ్శాంతిని అందిస్తుంది. గెలాక్సీ ఏ16 5జి ఈ విధంగా బలమైన భద్రత- దీర్ఘకాలిక మద్దతును మిళితం చేస్తుంది, స్మార్ట్‌ఫోన్‌లలో విశ్వసనీయత కోసం కొత్త ప్రమాణాన్ని నిర్దేసిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంచనాలను రెట్టింపు చేసిన దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' ట్రైలర్

"కేరింత" హీరోకు సింపుల్‌గా పెళ్లైపోయింది.. వధువు ఎవరంటే?

"రాజా సాబ్" నుంచి కొత్త అప్డేట్.. పోస్టర్ రిలీజ్.. ప్రభాస్ అల్ట్రా స్టైలిష్‌ లుక్

ప్రభాస్ బర్త్ డే సందర్భంగా "రాజాసాబ్" నుంచి మోస్ట్ అవేటెడ్ అప్డేట్

చై - శోభిత పెళ్లి పనులు ప్రారంభం... పసుపు దంచుతున్న ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

తర్వాతి కథనం
Show comments