సోలాల్ రూఫ్ టాప్ విద్యుత్... కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ : నిర్మలమ్మ వెల్లడి

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:00 IST)
కోటి గృహాలకు 300 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆమె గురువారం లోక్‌సభలో మధ్యంతర వార్షిక బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగంలో దేశ వ్యాప్తంగా కోటి ఇళ్లకు సౌర విద్యుత్ వెలుగులు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేస్తుందని చెప్పారు. ఇందులోభాగంగా, కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. 
 
రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని వివరించారు. రూఫ్ టాప్ సోలారైజేషన్ ద్వారా ఉత్పత్తి అయినదాంట్లో మిగులు విద్యుత్‌ను డిస్కమ్‌లకు విక్రయించవచ్చని తెలిపారు. ఇందులోభాగంగా, సోలార్ విద్యుత్ గ్రిడ్ ఏర్పాటు కోసం ఈ బడ్జెట్‌లో రూ.8500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 
 
కాగా, ఇతర సంక్షేమ, ఇతర పథకాలకు కేటాయించిన కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే, గ్రామీణ ఉపాధి హామ పథకానికి రూ.86 వేల కోట్లు, ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500 కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహాకాలకు రూ.6200 కోట్లు, సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీలో రూ.6903 కోట్లు, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పథకం కోసం రూ.600 కోట్లు చొప్పున విత్తమంత్రి కేటాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments