Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ సంస్థలో భారీ స్కామ్.. హైదరాబాద్ వాసిపై అభియోగాలు

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (15:06 IST)
అమేజాన్ సంస్థలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో తాజాగా హైదరాబాద్ వాసితో పాటు ఆరుగురిపై అభియోగాలు నమోదైనాయి. వ్యాపారులకు 10 కోట్ల డాలర్ల (రూ. 736 కోట్లు) అనుచిత లబ్ధి చేకూర్చిన కేసులో అమెరికా కోర్టు వీరిపై కేసులు నమోదు చేయించింది. 
 
నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన భారతీయ అమెరికన్ నిషాద్ కుంజు, తెలుగు యువకుడైన రోహిత్ కమిడిశెట్టి, ఎఫ్రయిమ్ రోజెంబర్గ్, జోసప్ నీల్సన్, క్రిస్టెన్ లెసీ, హదీస్ నానోవివ్ ఉన్నారు. కొంతమంది వ్యాపారుల సరుకులు అమ్ముకోడానికి వీలుగా వీరు అమేజాన్ కంపెనీ ఉగ్యోగులకు, కాంట్రాక్టర్లకు లంచాలు ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
 
లంచం కుంట్ర, సైబర్ నిబంధనల ఉల్లంఘన తదితర నేరాల కింద సియాటెల్‌లోని జిల్లా కోర్టు వీరిపై అభియోగాలు మోపింది. వీరిపై వచ్చే నెల 15 నుంచి విచారన మొదలవుతుంది. ఆన్‌లైన్ వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లో అవినీతిని, అనుచిత పోటీని నివారించాల్సిన అవసరముంది. లేకపోతే కస్టమర్లు నష్టపోతారు. వారికి నాణ్యత లేని వస్తువులు అంటగట్టే అవకాశముందని ఎఫ్బీఐ ఏజెంట్ రేమాండ్స్ దూడా, అటార్నీ జనరల్ బ్రియాన్ మోరాన్ ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments