తిరుమల శ్రీవారికి హుండిలో భక్తులు సమర్పించిన కానుకలను బాండ్ల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వద్ద వుంచాలని పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని బిజేపి తీవ్రంగా వ్యతిరేకిస్తూందని బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగోలేదు. టిటిడి నిధులు మల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని అనుమానం కలుగుతోందన్నారు. టీటీడీ పాలకమండలి వడ్డీల కోసం ఆలోచించడానికి
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యాపార సంస్థ కాదన్నారు.
భక్తులు సమర్పించే కానుకులను బ్యాంకులోనే డిపాజిట్లు చెయ్యాలనీ అన్యమతస్థులు ఎవరు శ్రీవారి దర్శనానికి వచ్చినా సరే డిక్లరేషన్ ఇచ్చి రావలసిందే అన్నారు. ఎవరి కోసం డిక్లరేషన్ అవసరం లేదని టిటిడి చైర్మన్ ఎవర్ని ఉద్దేశించి అన్నారు బహిరంగంగా ప్రకటించాలి.
శ్రీవారిపై విశ్వాసం వుందనే కదా డిక్లరేషన్లో వుంది. ఆ మాత్రం దానికి డిక్లరేషన్లో ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని, రాబోవు కాలంలో టిటిడి వ్యయం చేస్తున్న నిధులు ప్రతి నెల భక్తులుకు తెలియజెయ్యాలి అన్నారు.