Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబరు 31 వరకు అంతర్జాతీయ విమానాలకు బ్రేక్!

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (05:28 IST)
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలకు బ్రేక్ వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణతో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో విమానాల రాకపోకల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వచ్చే నెల 31 వ‌ర‌కు అంత‌ర్జాతీయ విమా‌నాల రాకపోకలను ర‌ద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
 
అయితే, కొన్ని ప్ర‌త్యేక రూట్ల‌లో డీజీసీఏ ప్ర‌త్యేకంగా అనుమ‌తించిన విమానాలు, కార్గో విమానాలు మాత్రం నడుస్తాయని తెలిపింది. కరోనా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా విమానాల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ ప్రకటించింది. 
 
కరోనా వేళ ప్రయాణాలకు సంబంధించిన ప్ర‌యాణ‌, వీసా ప‌రిమితుల పేరుతో కొత్తగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఏడాది జూన్ 26న విడుద‌ల చేసిన స‌ర్క్యుల‌ర్‌లో మార్పులు చేస్తున్నామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments