Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లకల్లోల ప్రపంచంలో ఒక చుక్కానిలా ఎదుగుతోన్న ఇండియా

ఐవీఆర్
గురువారం, 10 ఏప్రియల్ 2025 (23:01 IST)
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్ఈ)ఎండి & సీఈఓ శ్రీ ఆశిష్‌కుమార్ చౌహాన్, ప్రపంచ ప్రతికూలతలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్, భవిష్యత్తు అవకాశాల మధ్య భారత మార్కెట్ పనితీరుపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. ముంబై ఎన్ఎక్స్ టి (NXT) 25లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. గరిష్ట స్థాయి నుండి $1.5 ట్రిలియన్లు తగ్గినప్పటికీ, భారత మూలధన మార్కెట్ల దీర్ఘకాలిక వృద్ధి పథాన్ని చౌహాన్ నొక్కిచెప్పారు. “2014లో, భారతదేశ మార్కెట్ క్యాప్ $1 ట్రిలియన్ కంటే తక్కువగా ఉంది. నేడు, ఇది $5 ట్రిలియన్లకు చేరుకుంది- ఇది గణనీయమైన సంపద సృష్టిని ప్రదర్శిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
 
విదేశీ పెట్టుబడిదారుల నిష్క్రమణలపై పెరుగుతున్న ఆందోళనలను ప్రస్తావించిన, చౌహాన్ ఈ ధోరణికి ప్రపంచ వడ్డీ రేటు కదలికలు, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను ప్రభావితం చేసే విస్తృత 'రిస్క్-ఆఫ్' సెంటిమెంట్ కారణమని పేర్కొన్నారు. అయితే, భారతదేశం యొక్క ప్రత్యేకమైన ఎగుమతి ప్రొఫైల్ ద్వారా మద్దతు ఇవ్వబడిన ప్రపంచ సుంకాల ఉద్రిక్తతల నుండి దాని సాపేక్ష ఇన్సులేషన్‌ను ఆయన నొక్కి చెప్పారు.
 
భారత మార్కెట్‌కు చోదక శక్తిగా రిటైల్ భాగస్వామ్యం కొనసాగుతోంది. 60 మిలియన్లకు పైగా భారతీయులు క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు (ఎస్ఐపి లు) ద్వారా నెలకు రూ. 250 కంటే తక్కువే అయినప్పటికీ తమ వంతు తోడ్పాటు అందించటంతో, మార్కెట్ నెలకు దాదాపు US $2.5-3 బిలియన్ల స్థిరమైన ఇన్‌ఫ్లోను చూస్తుంది. "ఇది భారతీయ వ్యవస్థాపకులు, వ్యాపారాలపై పెరుగుతున్న నమ్మకాన్ని చూపిస్తుంది" అని చౌహాన్ అన్నారు.
 
ఆర్థిక సమ్మిళిత అనే అంశంపై చౌహాన్ స్పందిస్తూ, మార్కెట్ వ్యాప్తిని పెంచడంలో చిన్న-మొత్తంలో పెట్టుబడుల ప్రాముఖ్యతను వెల్లడించారు. "ఈ ప్రత్యక్ష పెట్టుబడులు మార్కెట్ అస్థిరత దశలలో కూడా పెరుగుతున్న పెట్టుబడిదారుల పరిపక్వతను ప్రతిబింబిస్తాయి" అని ఆయన జోడించారు.
 
మార్చి చివరిలో మాత్రమే 50కి పైగా దాఖలుతో, ఐపిఒ ఊపు ఉన్నప్పటికీ, నిరంతర ప్రపంచ అనిశ్చితి లిస్టింగ్ కాలక్రమాలను ప్రభావితం చేస్తుందని చౌహాన్ అంగీకరించారు. 2024లో, ఎన్ఎస్ఈ 268 ఐపిఒలకు వేదికగా నిలిచింది, $19.6 బిలియన్లను సేకరించింది, ఇది ప్రపంచంలోనే అత్యధిక ఐపిఒ నిధుల సేకరణ, ఎస్ఎంఈ రంగం నుండి 178 ఐపిఒ లు వచ్చాయి. మొత్తంమీద, ఎన్ఎస్ఈ లో నిధుల సమీకరణ US$209 బిలియన్లకు పైగా ఉంది.
 
సమతుల్య దృక్పథంతో చౌహాన్ మాట్లాడుతూ , "భారతదేశం ప్రపంచ అల్లకల్లోలాన్ని జాగ్రత్తగా ఎదుర్కొంటోంది. ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయి. మన నియంత్రణ సంస్థలు మరియు ప్రభుత్వం స్థిరమైన రీతిలో చేయూత అందిస్తూనే ఉన్నాయి" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments