Webdunia - Bharat's app for daily news and videos

Install App

10,000 మంది కళాశాల విద్యార్థులకు నైపుణ్యం: తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించిన హిందుస్థాన్ కోకా-కోలా

Webdunia
సోమవారం, 17 జులై 2023 (20:04 IST)
భారతదేశంలోని ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ (హెచ్‌సిసిబి) 2023-24 నాటికి అదనంగా మరో 10,000 మంది కళాశాల విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు&వాణిజ్య శాఖతో తమ అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు, హెచ్‌సిసిబి మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసి 2022లో తమ భాగస్వామ్య మొదటి సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 10196 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాయి.
 
తెలంగాణ ప్రభుత్వ  కార్మిక మరియు ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి, శ్రీ సి హెచ్ మల్లారెడ్డి, సమక్షంలో హెచ్‌సిసిబి  మరియు  తెలంగాణ  ప్రభుత్వం ఈకార్యక్రమాన్నివిస్తరిస్తున్నట్లు  ప్రకటించాయి; పరిశ్రమలు & వాణిజ్యం, IT, E&C ప్రిన్సిపల్ సెక్రటరీ, డాక్టర్ జయేష్ రంజన్, IAS, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సీఈఓ శ్రీ శ్రీకాంత్ సిన్హా మరియు హిందూస్థాన్‌  కోకా-కోలా బెవరేజెస్ చీఫ్ పబ్లిక్ అఫైర్స్,  కమ్యూనికేషన్స్ & సస్టైనబిలిటీ ఆఫీసర్ శ్రీ  హిమాన్షు ప్రియదర్శి, హిందూస్థాన్‌ కోకా-కోలా బెవరేజెస్ హెడ్ - హెచ్ ఆర్ శ్రీమతి చిత్ర గుప్తా మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
"క్యాంపస్ టు కార్పోరేట్" అని కూడా పిలువబడే ఈ కార్యక్రమం కళాశాల విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేయడం, నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. TASK విద్యార్థుల బ్యాచ్‌లను రూపొందించడం, భౌతిక తరగతి గది సెషన్‌ల కోసం ప్రాంతాలను గుర్తించడం మరియు ఈ శిక్షణా సెషన్‌ల కోసం క్యాలెండర్‌పై పని చేస్తుంది. మరోవైపు హెచ్‌సిసిబి కంటెంట్‌ను అభివృద్ధి చేయడం, శిక్షకులను గుర్తించడం, నిపుణులైన శిక్షకుల సమూహాన్ని సృష్టించడం మరియు విస్తరించడం కోసం ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్ (TTT) నిర్వహించడం మరియు వర్చువల్ మరియు ఫిజికల్ క్లాస్‌రూమ్ సెషన్‌లను నిర్వహించడం వంటి వాటిపై పనిచేస్తుంది.
 
ఈ ఎమ్ఒయు యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ,  తెలంగాణ ప్రభుత్వ  కార్మిక మరియు ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి  శాఖల మంత్రి, శ్రీ సి హెచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ, ”ప్రభుత్వం, పరిశ్రమలు మరియు విద్యాసంస్థల మధ్య సమన్వయాన్ని సృష్టించడమే మా ప్రయత్నం. వివిధ కార్పొరేట్‌లలో మెరుగ్గా విధులను నిర్వహించటం కోసం శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్‌లను  అందించాలనే లక్ష్యంతో మరియు మన రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరులను తయారు చేయడంలో TASK చురుకుగా ముందుంటుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. వెనుకబడిన యువత, ఉత్పాదక శ్రామిక శక్తిలో చేరేందుకు వీలుగా మరియు వారికి  సాధికారత కల్పించేందుకు మా ప్రయత్నాలలో భాగంగా మాతో భాగస్వామ్యం చేసుకున్నందుకు హిందూస్థాన్ కోకా-కోలా బెవరేజెస్‌ను కూడా నేను అభినందిస్తున్నాను. హెచ్‌సిసిబి వంటి వ్యూహాత్మక భాగస్వాములు తెలంగాణ కోసం “ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్‌క్లూజివ్ గ్రోత్” అనే మా లక్ష్యం దిశగా స్థిరంగా ఉండటానికి మాకు సహాయం చేస్తున్నాయి ..." అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments