Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్కూలులో పూటుగా మద్యం సేవించిన విద్యార్థులు... వైన్ షాపుపై కేసు!

liquor
, గురువారం, 13 జులై 2023 (09:35 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు పాఠశాలలోనే పూటుగా మద్యం సేవించారు. వీరిలో ఏడుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు కాగా, ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో వారు టీచర్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు. అలాగే, వారికి మద్యం విక్రయించిన వైన్ షాపు సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు. 
 
ములుగు జిల్లాలోని మల్లంపల్లిలోని ఈ పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు.. శనివారం రాత్రి మల్లంపల్లిలోని ఓ దుకారణంలో మద్యం కొనుగోలు చేసి, ఏకంగా స్కూలుకు తీసుకొచ్చి సేవించారు. ఇది చూసిన పీఈటీ మాస్టర్ వారిని మందలించి వదిలివేసి, మరోమారు ఇలాంటి పని చేయమని వారందరితో లేఖ రాయించుకున్నారు. మరుసటి రోజు విద్యార్థులంతా ఎవరికీ చెప్పకుండా హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. 
 
పైగా, పీఈటీ మాస్టర్ మద్యం సేవించి తమతో లేఖ రాయించుకున్నారంటూ తమ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో వారు ఆగ్రహంతో ఊగిపోతూ హాస్టల్‌కు వచ్చిన ఉపాధ్యాయుడిని నిలదీశారు. వారి ఫిర్యాదు మేరకు సాంఘిక సంక్షేమ శాఖ రీజినల్ కోఆర్డినేటర్ విద్యారాణి, తహసీల్దారు సత్యనారాయణ స్వామి పాఠశాలకు వెళ్లి విచారించగా విద్యార్థులే మద్యం తాగినట్టు వెల్లడైంది.
 
మొత్తం 9 మంది విద్యార్థుల్లో తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఏడుగురు, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఇద్దరు ఉన్నట్టు తేల్చారు. వీరిలో ఎక్కువ మంది ఏటూరు నాగారంకు చెందిన వారిగా గుర్తించారు. అంతేకాకుండా, శనివారం రాత్రి వీరంతా మద్యం కొనుగోలు చేసినట్టు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. అయితే, ఇప్పటివరకు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీరామ వైన్స్‌పై కేసు నమోదు చేసినట్టు ములుగు ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజోలు మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణరాజు కన్నుమూత