Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రీమియం విభాగంలో తన ఎక్స్ పల్స్ పోర్ట్ ఫోలియోకు తాజా లుక్‌ను జోడించిన హీరో మోటోకార్ప్

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (23:54 IST)
ప్రపంచంలోనే మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల అతిపెద్ద తయారీసంస్థ అయిన హీరో మోటోకార్ప్ తన ప్రీమియం పోర్ట్‌ ఫోలియోకు నవ్యతను, థ్రిల్లింగ్ అనుభూతులను జోడించడంలో తన నిబద్ధతను మరింత పటిష్ఠం చేస్తూ నేడిక్కడ ఆల్-న్యూ ఎక్స్‌ పల్స్ 200T 4 వాల్వ్‌‌ను ఆవిష్కరించింది. మెరుగైన టూరింగ్ సామర్థ్యాలు, అత్యుత్తమ అత్యాధునిక సాంకేతికత, డిజైన్లతో, పనితీరులో స్పష్టమైన పురోగతితో, సరికొత్త హీరో ఎక్స్ పల్స్ 200టి 4-వి, ఎక్స్ పల్స్ విజయగాథలో మరో అధ్యాయాన్ని రాయడానికి సిద్ధంగా ఉంది.
 
200cc 4 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో అమర్చబడి, ఆధునిక టూరర్ 6% ఎక్కువ శక్తిని, 5% అదనపు టార్క్‌ ను అందిస్తుంది, తద్వారా రోజంతా అధిక వేగంతో ఆహ్లాదకరమైన,  ఒత్తిడి లేని రైడ్‌ను అందిస్తుంది. రీ-ట్యూన్ చేయబడిన పవర్-టార్క్ కర్వ్, రివైజ్డ్ ట్రాన్స్‌ మిషన్ రేషియోలు ఇందుకు వీలు కల్పిస్తోంది. తద్వారా వినియోగదారులు ప్రతి ప్రయాణాన్ని కూడా ఎంతగానో ఆస్వాదించవచ్చు. ఈ మోటార్‌సైకిల్‌లో అత్యుత్తమ టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీ టర్,  సర్వీస్ రిమైండర్ వంటి అనేక రకాల ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు ఉన్నాయి.
 
ఎక్స్‌ పల్స్ 200T 4వాల్వ్‌ దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌ల వద్ద ఆకర్షణీయమైన ధర రూ. 1,25,726 వద్ద అందుబాటులో ఉంది. (ఎక్స్-షోరూమ్, ముంబై)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీతేజ్ కుటుంబానికి రూ.2కోట్లు నష్టపరిహారం.. అల్లు అరవింద్, దిల్ రాజు ప్రకటన (video)

Pushpa-2: పుష్ప2 కలెక్షన్లు కుమ్మేసింది.. 20వ రోజు రూ.14.25 కోట్లు వసూలు

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments