Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హోలిస్టిక్‌ వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌ వైటాలిటీని భారతీయ వినియోగదారులకు పరిచయం చేసిన టాటా ఏఐఏ

image
, మంగళవారం, 20 డిశెంబరు 2022 (23:15 IST)
భారతదేశంలో సుప్రసిద్ధ జీవిత భీమా సంస్థలలో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (టాటా ఏఐఏ) తమ విస్తృత శ్రేణి జీవిత భీమా పరిష్కారాలను మరింతగా విస్తరిస్తూ వినూత్నమైన వెల్‌నెస్‌ ప్రోగ్రామ్‌ టాటా ఏఐఏ వైటాలిటీ ఆవిష్కరించింది. ఇది తమ రైడర్‌ ప్యాకేజీలు, వైటాలిటీ ప్రొటెక్ట్‌, వైటాలిటీ హెల్త్‌ ద్వారా లభ్యమవుతుంది. ఈ ఆవిష్కరణతో, టాటా ఏఐఏ భారతదేశంలోని వినియోగదారులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వైటాలిటీ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేసింది.గత 25 సంవత్సరాలుగా 40 దేశాలలో 30 మిలియన్ల మంది వ్యక్తులకు ఈ ప్లాట్‌ఫామ్‌ ప్రయోజనం చేకూర్చింది.
 
టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌ వెంకీ అయ్యర్‌ మాట్లాడుతూ ‘‘టాటా ఏఐఏ వద్ద మేము మా వినియోగదారుల అవసరాలకనుగుణంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంటాము. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మేము కూడా మారుతుండటమే కాదు, వారిని లక్ష్యంగా చేసుకుని వినూత్నమైన, వినియోగదారుల లక్ష్యిత ఉత్పత్తులను విడుదల చేస్తుంటాము. వైటాలిటీ ప్రతిపాదనను పరిచయం  చేయడమనేది పేయర్‌ నుంచి పార్టనర్‌గా మారడంలో ఓ ప్రతిష్టాత్మకమైన ముందడుగుగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంతో మా వినియోగదారులు ఆరోగ్యవంతమైన జీవనశైలి స్వీకరించడంతో పాటుగా అదనపు ప్రయోజనాలనూ పొందగలరని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
వైటాలిటీ గ్లోబల్‌ సీఈఓ బార్రీ స్వార్ట్జ్‌ బెర్గ్‌ మాట్లాడుతూ ‘‘టాటా ఏఐఏతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఇప్పటికే 40 దేశాలలో  కార్యకలాపాలనందిస్తున్న తాము భారతదేశంలో కూడా కార్యకలాపాలను ప్రారంభించడంతో  లక్షలాది మందిని ఆరోగ్యవంతంగా మలచగలము’’ అని అన్నారు. టాటా ఏఐఏ బ్రాండ్‌ అంబాసిడర్‌ నీరజ్‌ చోప్రా మాట్లాడుతూ మనం వెల్‌నెస్‌ను చూస్తోన్న తీరులో గణనీయమైన మార్పును ఈ భాగస్వామ్యం తీసుకురానుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలపై జరుగుతున్న దాడుల్లో బీహార్ కంటే ఏపీలోనే అధికం : కేంద్రం