Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2022 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించిన టాటా ఏఐఏ లైఫ్‌

Advertiesment
2022 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించిన టాటా ఏఐఏ లైఫ్‌
, మంగళవారం, 11 జనవరి 2022 (23:49 IST)
ఇండివిడ్యువల్‌ వెయిటెడ్‌ నూతన వ్యాపార ప్రీమియం కింద భారతదేశంలో అగ్రగామి జీవిత భీమా సంస్థలలో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కో లిమిటెడ్‌ (టాటా ఏఐఏ లైఫ్‌) 2022 ఆర్థిక సంవత్సర తొలి అర్ధభాగానికి ఫలితాలను వెల్లడించింది. ఈ బీమా సంస్థ తొలి అర్ధ సంవత్సరంలో 1593 కోట్ల రూపాయల ఐడబ్ల్యుఎన్‌బీపీ ఆదాయం నమోదు చేసింది. తద్వారా గత ఆర్ధిక సంవత్సరం ఇదే కాలంలో నమోదు చేసిన 1280 కోట్ల రూపాయలతో పోలిస్తే 24.5% వృద్ధి నమోదయింది. ఆర్థిక సంవత్సరం 2022 రెండవ త్రైమాసంలో ఇది మరింత ఉత్తమంగా 39% వృద్దిని నమోదు చేసింది.

 
జీవిత భీమా రక్షణ ప్రదాతగా ఈ కంపెనీ తన దృష్టిని, పునర్వైభవాన్ని కొనసాగిస్తోంది. సెప్టెంబర్‌ 2021 కోసం, ఇది దేశంలోనే ప్రైవేట్‌ బీమా సంస్థల నడుమ అత్యధిక రిటైల్‌ సమ్‌ అస్యూర్డ్‌‌ను నమోదుచేసింది. మొత్తం ప్రీమియం ఆదాయం 2022 తొలి అర్థ ఆర్థిక  సంవత్సరంలో 5,255 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది.

 
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో అది 4,269 కోట్ల రూపాయలుగా ఉంది. తద్వారా 23% వృద్ధిని నమోదు చేసింది. రెన్యువల్‌ ప్రీమియం ఆదాయం 27% వృద్ధి చెంది 3,375 కోట్ల రూపాయలుగా నమోదయింది. నిర్వహణలోని మొత్తం ఆస్తులు సైతం 38% తొలి అర్ధ భాగంలో  వృద్ధి చెందాయి. 2021 తొలి అర్ధ ఆర్ధిక సంవత్సరంలో 37,409 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు అది 51,704 కోట్ల రూపాయలకు పెరిగింది.

 
ఈ ప్రదర్శన గురించి టాటా ఏఐఏ లైఫ్‌ ఎండీ అండ్‌ సీఈవో నవీన్‌ తహిల్యానీ మాట్లాడుతూ ‘‘రక్షణ మరియు పొదుపు విభాగాల వ్యాప్తంగా మా విస్తృత శ్రేణి ప్రదర్శన, మా వినియోగదారులు  మా పై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. సౌకర్యవంతమైన సేవలు, అతి సులభంగా పొందగల వేదికలు తోడుగా అత్యుత్తమ జీవిత భీమా పరిష్కారాలను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మా వినియోగదారుల జీవిత, సంపద, ఆరోగ్య సంబంధిత అవసరాలను తీర్చే రీతిలో వినూత్నమైన పరిష్కారాలను అందించేందుకు ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి, చిత్తూరులో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన సోచ్‌